Sunday 7 July 2013

ఉద్యమాల సెగ

సిక్కోలు సిగలో ఉద్యమాల సెగ
 

(శ్రీకాకుళం- మేజర్‌ న్యూస్‌ ప్రతినిధి):

ప్రజల ప్రగతి కోసమే శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తున్నా మని ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచీ చెప్పుకొస్తోంది. అభివృద్ధి ముసుగులో పర్యావరణ విధ్వంసం పొంచి ఉందని, స్వచ్ఛమైన గాలికి, మంచినీటికి, వ్యవసాయానికి, మత్యసంపదకు దూరమైపోతామని ప్రజలు ఉద్యమాల బాటపట్టారు. పరిశ్రమలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని చెబుతున్న మంత్రులు, అధికారులు, ఆయా పరిశ్రమల ప్రతినిధులు ప్రజలు లేవ నెత్తు తున్న ఎన్నో ప్రశ్నలకు కచ్చితమైన సమాధానమివ్వలేకపోతున్నారు. పరిశ్ర మలు వద్దని ఉద్యమిస్తున్న ప్రజల సందేహాలకు ప్రభుత్వం, పరిశ్రమల యజ మానుల పైపై మాటలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ పరిశ్రమల వల్ల అంతా మంచేజరుగుతుందని చెబుతున్న వారంతా ప్రజల్లో అనుమా నాలను నివృత్తి చేసే విషయంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోలీ సుల సాయంతో పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటామనే భ్రమలు విచ్ఛిన్నమైనా ఇంకా ఆయా పరిశ్రమల ప్రతినిధులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అదే నమ్మకంలోముంచేస్తున్నారు.
ట్రైమాక్స్‌పై
రగులుతున్న మత్స్యకారులు

జిల్లాలో వజ్రపు కొత్తూరు, సంతబొ మ్మాళి మండలాల పరిధిలో ట్రైమాక్స్‌ సంస్థ చేపట్టబోయే బీచ్‌శాండ్‌ మినరల్స్‌ పరిశ్రమ ఏర్పాటుపై మత్యస్యకారులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వజ్రపు కొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామంలో రెండేళ్ల కిందట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తీరంలో ఇసుక తవ్వకాలు, ఖనిజాల శుద్ధి పరిశ్రమ వల్ల తీరంలోని ఇసుకతిన్నెల్లో గల జీడితోటలు, సామాజిక అటవీ ప్రాంతం, జిరాయితీ భూముల్లో ఉండే పంటలు, వక్షాలు కనుమరుగవుతాయని మత్స్యకారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని సంచరించే అరుదైన పక్షుల ఉనికి లేకుండా పోతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరానికి సహజరక్షణ కవచంలా వున్న ఇసుక తిన్నెలను తవ్వేస్తే మత్స్యకార గ్రామాలు సునామీలు, ఉప్పెనలు వంటి ప్రకతి వైపరీత్యాలకు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు, మత్స్యసంపదా అంతరిస్తాయని చెబుతు న్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితమై తాగునీరు, సాగునీరు కరువౌ తుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివురుగప్పిన నిప్పులా సోంపేట థర్మల్‌
సోంపేట మండలం బీలలో ఎన్‌సీసీ నిర్మించబోయిన థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ అనుకూలంగానే ఉంది. అందువల్లే ప్రాజెక్టు మంజూరుకు ఉద్దేశించిన జీవోను ఇంతవరకూ రద్దు చేయలేదు. 2010 జూలై 14న ఈప్రాజెక్టు పనులను అడ్డుకునే విషయంలో జరిగిన థర్మల్‌ వ్యతిరేక పోరాటంలో ముగ్గురు రైతు కూలీలు పోలీసుల తూటాలకు బలయ్యారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో 400 మంది వరకు పోలీసుల లాఠీలకు గాయపడ్డారు. మృతిచెందిన కుటుంబాలకు అరకొరగా పరి హారం ఇచ్చిన ప్రభుత్వం క్షతగాత్రులను పట్టించుకోకుండానే గాలికొదిలేసింది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరు తూ ప్రజల రిలే నిరాహారదీక్షలు ఇప్పటికీ సోంపేటలో కొనసాగుతు న్నాయి.
చల్లారని కాకరాపల్లి థర్మల్‌ సెగలు
సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో ఈస్ట్‌కోస్టు ప్రైవేటు లిమి టెడ్‌ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగు తున్న పవర్‌ ప్రాజెక్టుపై కూడా వివాదం చెలరేగింది. మత్స్యకారులు, అఖిలపక్ష నేతలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకి స్తున్నారు. 2011 ఫిబ్రవరి నెలాఖరులో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చెలరేగింది. దీనిని ఎలాగైనా అణచివేయడానికి పోలీసులు ప్రయత్నించి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నారు. పొగబాంబులతో వడ్డితాండ్ర గ్రామాన్ని తగులబెట్టారు. అయినా సరే ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం పవర్‌ ప్రాజెక్టు పనులు బయటకు తాత్కాలికంగా నిలిపివేసి, లోపల యథావిధిగా పనులు చేసుకుంటున్నారు. ఇటీవల ఈ పవర్‌ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేశా యంటూ పరిశ్రమ ప్రతినిధులు ప్రకటించడంపై అఖిల పక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్డగోలుగా ఈ పవర్‌ప్రాజెక్టు నిర్మాణం జరుగు తోందని పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తు న్నారు. అధికారులు మాత్రం తమకు అందిన తాయి లాలతో నోర్లు మెదపడం లేదు.
అణువిద్యుత్‌పై ప్రజాభిప్రాయ సేకరణ లేనట్టేనా?
భారత్‌ అమెరికాతో చేసుకున్న అణుఒప్పందంలో భాగంగా రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశంలో నిర్మాణం కానున్న అణువిద్యుత్‌ కేంద్రం వివాదానికి కారణమవుతోంది. అణుధార్మిక ప్రమాదాలపై సరైన వివరణలు ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుం డానే అధికార యంత్రాంగం సర్వేలు పూర్తిచేయడం, భూసేకరణకు సిద్ధమై పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభు త్వ జోక్యంతోనే జిల్లా అధికార యంత్రాంగం అత్యుత్సాహం చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరిపాకే అణువిద్యుత్‌ కేంద్రంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి రెండేళ్ల కిందటే ప్రకటించారు.
ఇది జరిగి ఏళ్లు గడిచినా చట్టబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఇంతవరకూ జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా సర్వేలు నిర్వహించి, భూసేకరణకు సిద్ధమైపోయిన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతారా? లేదో?ననే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా మీడియాను అనుకూలంగా మార్చుకోవడానికి అణువిద్యుత్‌ ప్రాజెక్టులపై అవగాహన నిమిత్తం తమిళనాడులోని కల్పకం అణువిద్యుత్‌ కేంద్రానికి వారిని విహార యాత్రకు కూడా తీసుకువెళ్లొచ్చారు.
పవర్‌గ్రిడ్‌పై భగ్గుమంటున్న జనం
పలాస మండలం రామకృష్ణాపురంలో ఏర్పాటు చేయబోయే పవర్‌గ్రిడ్‌పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో నిర్మించనున్న పవర్‌ ప్రాజెక్టులకు అనుసంధానించడానికే ఈ పవర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సమాధానమివ్వలేకపోతున్నారు. అంతేకాకుండా పవర్‌గ్రిడ్‌ దిగువ, పరిసరాల్లోనూ అధిక విద్యుత్‌ రేడియేషన్‌తో క్యాన్సర్లు, వంధత్వం, మతిమరుపు, మానసిక సమస్యలు, లుకేమియా తదితర ప్రాణాంతక వ్యాధులు తప్పవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయంలో కూడా ప్రజల అనుమానాలను అధికారులు సక్రమంగా నివృత్తి చేయలేకపోతున్నారు. మొత్తమ్మీద శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి మాటున జరగనున్న విధ్వంసంపై ప్రజల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి.
| |

Sunday 26 May 2013

లంబాడాలు

నిజాం పాలనలో లంబాడాలు
(Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams)
- భంగ్యా భుక్యా


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా



ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి. ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌ సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా

ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com
నిజాం పాలనలో లంబాడాలు
 (Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams) 
- భంగ్యా భుక్యా


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా
 


ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి.  ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌  సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన  లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా

ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

మంత్రులు...మాయలు

రాజీనామాల డ్రామాలకు తెర
 
 
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఆదివారం ఆమోదించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం వారి రాజీనామా పత్రాలను గవర్నర్‌కు పంపించారు. వాటిని గవర్నర్ వెంటనే ఆమోదించారు. జగన్ కేసులో ధర్మాన, సబితలు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని సిబిఐ వాదన. జగన్ కేసుకు సంబంధించి వాన్‌పిక్ అంశంలో ధర్మాన ప్రసాద రావు, దాల్మియా అంశానికి సంబంధించి సబితా ఇంద్రా రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సిబిఐ ఛార్జీషీటులో అభియోగాలు నమోదు కావడంతో వారిద్దరిచే రాజీనామా చేయించాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలకు సూచించింది. సబిత, ధర్మానలు గతంలోనే రాజీనామా చేశారు. అయితే, వారు ఏ తప్పు చేయాలేదని చెబుతూ ముఖ్యమంత్రి వాటిని పక్కన పెట్టారు. కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులచే అధిష్టానం రాజీనామా చేయిస్తుండగా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటంపై సొంత పార్టీ నేతల నుండి విమర్శలు వచ్చాయి. మరోవైపు అధిష్టానం కూడా కిరణ్, బొత్సలను పిలిచి రాజీనామా చేయించాలని, వాటిని ఆమోదించేలా చూడాలని ఆదేశించింది. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకే సబిత, ధర్మాన రాజీనామాలను ఇప్పటికిప్పుడు గవర్నర్ వద్దకు పంపడం, వాటిని నరసింహన్ వెంటనే ఆమోదించడం జరిగిందని అంటున్నారు. కొన్నాళ్లుగా సస్పెన్స్‌కు దారి తీసిన రాజీనామాల వ్యవహారం ఈ రోజుతో ఓ కొలిక్కి వచ్చింది.

Monday 4 March 2013

మధునాపంతుల

ఆంధ్ర రచయితల రచయిత
Untitled-2ఆదికవి నన్నయా, కాదా అని ఇప్పటికీ సాహిత్య విమర్శ కులు, చరిత్ర పరిశోధకులు తర్జన భర్జన పడు తూ ఉన్నారు. అయితే నన్నయ కన్నా ముందుతరాల్లోనే కొంత మంది రాసిన తెలుగు పద్యాలు అక్కడక్కడా బయట పడ్డాయి. మహా భాగవతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ ‘నానా రుచిరార్ధసూక్తినిధి’గా కవి పండితులకు మార్గదర్శకుల య్యారు. ఆయన నడిచిన దారి లోనే నడిచి విశేష సాహితీ ప్రజ్ఞను ఆవిష్కరిం చారు ‘మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తి’. ఆదికవి నన్నయను ప్రేరణగా తీసుకొని సాహి తీయజ్ఞం చేసిన వారిలో అగ్రగణ్యులు మధునాపంతుల. ఆధునిక సాహితీయుగంలో కూడా అభినవ నన్నయగా గుర్తింపు పొందినది మధునాపంతుల ఒక్కరే.

ఆయనకు నన్నయపై భక్తి ప్రపత్తులు, గౌరవభావం ఎలాంటివో ఆయన రాసిన ఈ పద్యం చదివితే ప్రస్ఫుటమౌతుంది- ‘కాలంబెంత గతించి పోయినను ఆకల్పాంత సంస్థాయిగా/ నేలన్‌ నిల్వఁగఁ జూలు వ్యాస కవితా నిర్మాణమునన్‌ బాసలో/ నాలాపింపఁగ పంచ మ శృతి గరీయ స్వాదు సన్మాధురీ/ శ్రీలన్‌ నన్నయ కోకిలంబు సవరించెన్‌ గంటపున్కంఠమున్‌’ (ఎంతకాలము గడిచిపోయినప్పటికీ ఆకల్పాంతమూ స్థిరమైన వ్యాసకవి కృత జయమను పేరుగల మహాభారతాన్ని తెలుగు భాషలో ఆలపించుకునే విధంగా పంచమ శృతి (శృతి= వేదము, పంచమ శృతి= పంచమవేదము)లో సన్మాధురీ శ్రీలను నన్నయ అనే కోకిల గంటమనే కంఠంతో సవరించెను).ఒక అసమాన ప్రతిభాశాలి అయిన నన్నయకు మరో అసమాన ప్రతిభా శాలి అయిన మధునాపంతుల వారు ఇచ్చిన అపూర్వ నిర్వచనమిది.

మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తి, నన్నయ స్ఫూర్తిని మరింత ముందుకు తీసు కువెళ్లి నవీనాంధ్ర సాహితీలోకంలో సంప్రదాయ కవితాపరిరక్షణచేస్తూ అటు సంప్రదా యవాదులకు, ఇటు నవీనపథగాములకు ఆమోద యోగ్యమైన రచనలుచేశారు. ఆక్ర మంలోనే ఆంధ్రపురాణాన్నిరాసి ఆంధ్రోద్యమానికి ఎనలేని కృషిచేశారు. ఆంధ్రరచయి తలు అనే బృహత్కంగ్రంథం రాసి 113 మంది కవుల సాహిత్య జీవిత చిత్రణ చేశారు. మధునాపంతుల 1920 మార్చి 5న కోనసీమలోని ఐలెండ్‌ పోలవరంలో మాతామహు లు ఆకొండి రామమూర్తి శాస్ర్తి ఇంట జన్మించారు. ఆయన తండ్రి మధునాపంతుల సత్యనారాయణమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యునిగా గుర్తింపు పొందారు. సంస్కృతాం ధ్రభాషల్లో గణనీయమైన పాండిత్యాన్ని సముపార్జించారు.

మధునాపంతులకు చిన్ననాట తొలిగురువు ఆయన తండ్రే. ఆయన ప్రోత్సాహంతో, తనగురువైన పిఠాపురం సంస్థాన ఆస్థానకవి ఓలేటి వెంకటరామశాస్ర్తి ఆశీస్సులతో బాల్యంలోనే మధురమైన ఛందో బంధాలతో కవితలల్లి సత్యనారాయణశాస్ర్తి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇరవై యేళ్లు వచ్చేసరికే మధునాపంతుల చిక్కని పద్యరచన, చక్కని గద్య రచనలో ఆందెవేసిన చేయిగా పేరుపొందారు.
తమ స్వగ్రామం దగ్గరలోని ఇంజరం గ్రామం లోగల మహేంద్రవాడ సుబ్బరాయశాస్ర్తి సన్ని ధిలో వ్యాకర ణశాస్త్రాన్ని సంస్కృత నాటకాలం కారాలను అధ్యయనం చేశారు. 1940లో మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్వాన్‌ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అదేఏడాది సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి షష్ఠిపూర్తి వేదికపై మధునాపం తులవారి ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది.

ఆ సభకు సర్‌ సివి రామన్‌ అధ్యక్షులు. అంతకు ముందే చిలకమ ర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షతన కాకినాడలోజరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలలో ఒక అవిస్మరణీయ ప్రసం గాన్నిచేశారు. ఇదే ఆయన తొలిప్రసంగం. ఆసమయం లో ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టింది మధునా పంతులవారే. నన్నయ ప్రేరణతో ‘ఆంధ్రపురాణం’ రచించారు. ఈ కావ్యం మధునా పంతుల వారికి ఆంధ్రసాహిత్య అకాడమీ పురస్కృతిని అందించింది. అనన్యమైన ఆంధ్రాభిమానంతో మధునాపంతుల పంతొమ్మిదోయేట పల్లెప్రజల్లో విద్యాభివృద్ధికీ, విజ్ఞానదృష్టికీ కృషి సల్పారు. పల్లిపాలెంలో ఆంధ్ర కుటీరాన్ని ప్రారంభించారు.
1939 మార్చిలో ‘ఆంధ్రి’ అనే మాసపత్రిక ప్రారంభించారు.

ఈపత్రిక మూడేళ్ల పాటుమాత్రమే కొనసాగిసప్పటికీ ఆంధ్రసాహితీలోకానికి విశేషసేవలు అందించిం ది.1941 నవంబర్‌లో ఈపత్రిక ఆగిపోవడం విషాదవిష యమే.ఆనాటికి సుప్రసిద్ధులైన ఆంధ్రరచయితల జీవనరేఖలను వారి సాహితీప్రతిభతో కలిపి ‘ఆంధ్రి’ పత్రికలో వరుస గా ప్రచురించారు. ఇలా 44 మంది రచయితలగురించి 1944లో ‘ఆంధ్ర రచయితలు’ తొలి సంపుటిని ప్రకటించారు. ఆ తర్వాత 1950లో 101మంది రచయితల సాహిత్య జీవిత విశేషాలతో సమగ్రమైన సంపుటాన్ని ఆద్దేపల్లి అండ్‌కో వారు ప్రచురించారు. ఆయన కుమారులు సీనియర్‌ పాత్రికేయులు మధునా మూర్తి, మధునాపం తుల సత్యనారాయణమూర్తి, ఆయన మనుమడు మధునాపంతుల శేషాద్రి శేఖర్‌ ఈగ్రంథా న్ని పరిష్కరించి 113 మంది కవుల జీవిత సాహిత్య చిత్రణలతో ‘ఆంధ్ర రచయితలు’ బృహత్సంపుటిని సాహితీ ప్రపంచంముందు ఉంచారు.

ఇందులో ఎంతోమంది రచయితలు నేటితరాలకి పరిచయంలేనివారే. అటువంటి రచయితలు విస్మరులు కారని, తెలుగువారికి నిత్యసంస్మరణీయులని ఈ సంపుటిద్వారా మధునా పంతుల నిరూపించారు.
తెలుగులో బృహత్‌ నిఘంటువు ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు’ రూపకల్ప నలో మధునాపంతుల పాత్ర కీలకమైనది. 1942లో షడ్దర్శన సంగ్రహాన్ని, 1943లో ‘రత్నపంచాలిక’, ‘సూర్య సప్తతి’ ఇలా 1986 వరకూ మధునాపంతుల వారు ఎన్నో రచనలు చేశారు. వాటిలో ఆయనను ఉత్తమోత్తమ కవుల శ్రేణిలో నిలిపిన ‘ఆంధ్రపురాణం’ను 1954లో ప్రకటించారు. దీనికి కవిసామ్రాట్‌ విశ్వ నాధ సత్యనారాయణ విపుల పీఠిక రాశారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న ఈకావ్యం సాహితీ విమర్శకులనుంచి ప్రశంసలందు కుంది.

తొమ్మిది పర్వాలతో అలరారే ఈ చారిత్రక కావ్యం ఆధునికాంధ్ర పంచ కావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈయన తొలి ఖండకావ్యం ‘తోరణము’. ఇది 1938లో వెలువడింది. మధునాపంతుల వారి మిగిలిన రచనల్లో ధన్వంతరి చరిత్ర,రత్నావళి నాటకము, బోధి వృక్షము నవల. చరిత్ర ధన్యులు, కళ్యాణ తార, స్వప్న వాసవదత్త, శ్రీఖండము, తెలుగులో రామాయణాలు, చైత్రరథ ము, సదాశివ పంచాంశిక, సాహిత్యవ్యాసాలు, కేళాకుళి, కథా పుష్కరిణి- నాలుగు భాగాలు, ప్రసంగ తరంగిణి వంటి అక్షర సంపద చాలా వరకూ అలభ్యం. వీటిని పునర్ముద్రించవలసి ఉంది.

తిరుమల తిరుపతి దేవస్థానములు, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు మధునాపంతుల వారి సంపాదకత్వంలో చాలా పుస్తకాలను వెలువరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనని ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించుకుంది. ఢిల్లీలో ఆలిండియా రేడియో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి కవి సమ్మే ళనంలో ఆయన తెలుగువారిపక్షాన వినిపించిన కవిత ఎందరి ప్రశంసలనో అందుకుంది. ఆనాటి ప్రపం చ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతులు మీదుగా 1975లో సన్మానాన్ని అందుకున్నారు. సర్వారాయ సాహితీ పురస్కారం, మహాంధ్ర జన పక్షాన రాజమండ్రిలో సన్మానం, ఆంధ్ర పురాణ రజతోత్సవం, అభిజనాభినందన ఇలా ఎన్నో సన్మానాలు, సత్కారాలు ఆయన జీవిత పర్యంతం అందుకున్నారు.

j.v-ratnakar11998లో హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌పై నన్నయ విగ్రహాన్ని ఆవిష్కరించింది మధునాపంతుల వారే. అదే యేడాది రాజమండ్రి లలితా నగర్‌లో ఆయన నివాసగృహం ఉన్న వీధికి పురపాలకసంఘం ఆయన పేరుపెట్టి గౌరవించుకుంది.1947లో వీరేశలింగ ఆస్తిక ఉన్నత పాఠశాలలో ఆంధ్రపండిత పదవిలో చేరిన మధునాపంతుల 1974 వరకూ అదే పాఠశాలలో పనిచేశారు. 1992 నవంబర్‌ 7న కాలధర్మం చెందారు.

Sunday 3 February 2013

(తోట భావన్నారాయణ గారి వ్యాసం)

విద్య, వ్యవసాయ చానెళ్ళకు ప్రభుత్వమే సైంధవుడు

- దూరదర్శన్‌కే మినహాయింపు!
- ‘ట్రాయ్‌’ది కూడా అదే సిఫారసు
- ఆలోచన విరమించిన మంత్రిత్వశాఖలు
- ‘ప్రైవేటు’ చానళ్ళకు అభ్యంతరం లేదు!
- ప్రభుత్వ శాఖలకే ఈ నియంత్రణ!
- పార్టీల చానెళ్ళ విషయం పట్టదా?
- అడ్డదారులు సూచిస్తున్న సమాచార శాఖ 


దూరదర్శన్‌ తప్ప ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోగాని, రాష్ట్ర ప్రభుత్వాలుగాని ఎవరూ కొత్త చానళ్ళు పెట్టటానికి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిజానికి కొన్ని మంత్రిత్వ శాఖలు తమ పరిధిలో చానెళ్ళు ఏర్పాటుచేసి ప్రజలకు మెరుగైన విజ్నానం, సమాచారం అందుబాటులోకి తీసుకురావాలను కున్నాయి. అయితే, సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మాత్రం ససేమిరా అంటోంది. పైగా ఈ విషయాన్ని పరిశీలించి సలహా ఇమ్మని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌)ని అడిగితే అక్కడినుంచి కూడా అదే సిఫార్సు వచ్చింది. దీంతో మానవ వనరుల శాఖ, వ్యవసాయ శాఖ సొంతగా అన్ని భాషల్లో విద్యార్థులకు, రైతులకు టీవీ ద్వారా విజ్ఞానం అందించాలనుకున్న ఆలోచన విరమించుకోవాల్సి వచ్చింది.

ప్రైవేటు శాటిలైట్‌ చానళ్ళ విషయంలో లేని అభ్యంతరాలు ప్రభుత్వ శాఖల విషయంలో ఎందుకొచ్చిందనే ప్రశ్నకు విచిత్రమైన సమాధానం అందింది. ఆ చానెళ్ళు ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఉపయోగపడతాయని, తద్వారా అధికార పార్టీకి లబ్ధి చేకూరుస్తాయని ట్రాయ్‌ చెబుతోంది. ఒక వైపు రాజకీయ పార్టీల చానెళ్ళు కు అనుమతి ఇస్తూనే మరోవైపు ప్రభుత్వశాఖలను మాత్రమే అడ్డుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంతుచిక్కదు. రాజకీయ పార్టీలు నేరుగా పార్టీ పేరుతో దరఖాస్తు చేయటం లేదని, కంపెనీల చట్టం కింద నమోదు చేసుకున్న ఏ సంస్థ అయినా శాటిలైట్‌ చానల్‌ పెట్టేందుకు అర్హమేగనుక అనుమతి ఇస్తున్నామని చెబుతోంది.

ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు చానెళ్ళు పెట్టదలచు కున్న ప్రభుత్వశాఖలకు అనుమతి నిరాకరిస్తూ, రాజకీయ పార్టీల విషయంలో తెలిసినా తెలియనట్టు నటించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాదు. చానెళ్ళకు అనుమతి ఇవ్వటానికి వాటిని న్యూస్‌ చానెళ్ళు, నాన్‌-న్యూస్‌ చానెళ్ళు పేరిట రెండు రకాలుగా వర్గీకరించారు.

న్యూస్‌ చానెల్‌ విభాగంలో లైసెన్స్‌ తీసుకున్నవాళ్ళు నూటికి నూరు శాతం వినోద కార్యక్రమాలు ప్రసారం చేసినా పట్టించుకోరు. కానీ వార్తేతర విభాగంలో లైసెన్స్‌ పొందిన చానెళ్ళు మాత్రం ఒక నిమిషం కూడా వార్తలు ప్రసారం చేయటానికి వీల్లేదు. ఈ వెసులుబాటు కారణంగా- ముందు జాగ్రత్తగా న్యూస్‌ లైసెన్స్‌ తీసుకొని, మ్యూజిక్‌ చానెళ్ళు నడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ రోజు దేశంలో ఎన్ని 24 గంటల న్యూస్‌ చానెళ్ళు ఉన్నాయో లైసెన్స్‌ ఇచ్చిన సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకే తెలియదు. ఎందుకంటే, న్యూస్‌ లైసెన్స్‌ తీసుకున్న చానెళ్ళలో దాదాపు సగం చానెళ్ళు వార్తలు ప్రసారం చెయ్యవు.

ఈ సమస్య నిజానికి పదేళ్ళ కిందట చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఒక చానల్‌ పెట్టాలని అనుకున్నప్పుడు కూడా చర్చకు వచ్చింది. అప్పుడు కూడా ఇదే కారణంతో అనుమతి నిరాకరించింది. అందుకు ప్రత్యామ్నాయంగా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఒక సొసైటీ ఏర్పాటుచేసి కెయు బాండ్‌లో ప్రసారాలు చేసుకోవటానికి ‘మన టీవీ’ ప్రారంభించింది. వాటి కోసం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేకంగా డిష్‌లు ఇవ్వాల్సి రావడం, తదితర కారణాలవలన పాఠశాలలకూ ఆసక్తి తగ్గిపోయింది. మరో నెలరోజుల్లో నాలుగింటిలో ఒక చానల్‌ను అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి ఇవ్వాలని నిర్ణయించడం వెనుక కూడా కేంద్ర ప్రభుత్వం శాటిలైట్‌ ప్రసారాలకు అనుమతి ఇవ్వకపోవటమే కారణమని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇలాంటి అనుమానాలతో నిరాకరించారని అనుకున్నా, వివిధ మంత్రిత్వ శాఖలు నడిపే చానెళ్ళు ఆయా శాఖల ఆధ్వర్యంలోని ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రసారభారతి ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న దూరదర్శన్‌ చానెళ్ళ వలన ప్రభుత్వ పథకాల ప్రచారం జరుగుతుందంటే మాత్రం సమాచార ప్రసారాల శాఖ నమ్మదట, వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతుల కోసం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో చానెళ్ళు నడపాలని ప్రతిపాదించినప్పుడు, మానవ వనరులశాఖ విద్యార్థుల కోసం 50 చానెళ్ళు ప్రారంభించాలని ప్రతిపాదించినప్పుడు మాత్రం అవి అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెడతాయేమోనన్న వితండవాదం ముందుకు తీసుకురావడమే చిత్రంగా ఉంది.

ఆ విధంగా రైతులకు, విద్యార్థులకు చానెళ్ళు అందకుండా అడ్డుకున్నారు. పైగా ఇప్పుడు ‘మన టీవీ’ భవితవ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశమేంటంటే, ప్రభుత్వమే పరోక్షంగా ఒక పరిష్కారమార్గం కూడా చెబుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు మాత్రమే శాటిలైట్‌ చానెళ్ళు ప్రారంభించే వీలున్నదని చెప్పటం ద్వారా ప్రభుత్వ సంస్థలను, శాఖలను కూడా ఆ దిశగా ప్రేరేపించడం. ప్రభుత్వ శాఖలు ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, దానిచేత ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టించి, ఆ కంపెనీ ద్వారా శాటిలైట్‌ చానెల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు.

ఇలా దొడ్డిదారి లైసెన్స్‌ విధానాన్ని సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వారు ఆమోదిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ దొడ్డి దారి విధానాన్నే ఉపయోగించుకొని చానల్‌ లైసెన్స్‌ తెచ్చుకుంది. మానవ వనరుల, వ్యవసాయ శాఖలు కూడా ఇప్పుడు ఇలాంటి దొడ్డిదారిని ఎంచుకోవటం మినహా మార్గం లేదు. రాజకీయ పార్టీలకు అలాగే ఇస్తున్నమని చెప్పటం ద్వారా కేంద్రప్రభుత్వం అందరికీ ఈ పరోక్ష సలహా ఇస్తోంది.

ఇక చానెళ్ళు పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలమీద కూడా ఆంక్షలు విధించింది. ఈ సమస్య తమిళనాడు వ్యవహారంతో చర్చకు వచ్చింది. కేబుల్‌ ఆపరేటర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తనచేతుల్లోకి తీసుకోవటం మీద కేంద్రానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆపరేటర్ల ఉపాధికి ఎక్కడా సమస్య రాలేదు. కేవలం కార్పొరేట్‌ ఎమ్‌ఎస్‌వోల దోపిడీని అడ్డు కోవటానికే ప్రభుత్వం రంగ ప్రవేశం చేసింది. ఆపరేటర్లు స్థానికంగా సేవలందిస్తూ, నెలసరి చందాలు వసూలు చేస్తూ ఎప్పట్లాగే తమ ఉపాధిని కొనసాగించు కుంటారు. హోల్‌సేల్‌ వ్యవస్థను ప్రభుత్వం తీసుకోవడం వలన తక్కువ చందాతో వినియోగదారులకు సేవలందుతాయి. ప్రభుత్వమే ఒక ఎమ్‌ఎస్‌వోగా అవతరించడం వలన పే చానెళ్ళతో బేరమాడే శక్తి పెరుగుతుంది. ఫలితంగా వినియోగదారులు ప్రయోజనం పొందుతారు.

కానీ తమిళనాడు ప్రభుత్వానికిప్పుడు చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాలు చానెళ్ళ పంపిణీ (కేబుల్‌ టీవీ) వ్యాపారంలోకి దిగకూడదని సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. నిజానికి అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన మనవడు కళానిధి మారన్‌తో విభేదాల కారణంగా అతడి కేబుల్‌ నెట్‌ వర్క్‌ను దెబ్బతీసేందుకు ప్రభుత్వమే కేబుల్‌ టీవీ నడపాలని నిర్ణయించారు. అరసు కేబుల్‌ నెట్‌వర్క్‌ పేరిట ఒక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటుచేశారు. కానీ అంతలోనే విభేదాలు సమసిపోయి లెక్కలు కుదరటంతో దాన్ని పక్కన బెట్టారు. జయలలిత అధికారంలోకి రాగానే అదే సంస్థను పునరుద్ధరించి కేబుల్‌ వ్యాపారాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో రాజకీయ కారణాలున్నప్పటికీ అంతిమంగా సామాన్యప్రజలు లబ్ధిపొందుతారు.

ప్రజలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆలోచించే విధానం వక్రంగా ఉందనటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్‌ నడవడం వలన సామాన్యప్రజలకు ఎలా లబ్ధి చేకూరిందో అధ్యయనం చేయటానికి ఏనాడూ ప్రయత్నించలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కెయు బాండ్‌లో మన టీవీ నడుపుకునేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా అక్కడ ప్రభుత్వ పథకాల ప్రచారం జరిగి రాజకీయ లబ్ధిపొందుతున్నారేమోనని కూడా ఎప్పుడూ ఆరా తీయలేదు. ఊహాజనితమైన, అర్థంలేని అనుమానాలతో సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తీసుకునే నిర్ణయాలు తిరోగామి దిశలో నడిపిస్తున్నట్టో, లేదంటే దొడ్డి దారినో, అడ్డదారినో వెళ్ళాలని సూచిస్తున్నట్టో ఉన్నది
 
(తోట భావన్నారాయణ గారి వ్యాసం)

Monday 28 January 2013

జాతీయ జెండాను తిరగేసిన..........

జాతీయ జెండాను తిరగేసిన ఆంధ్రజ్యోతి సిబ్బంది

 


ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ టివి ల అధినేత, పాత్రకేయుడు రాధాకృష్ణ తన కార్యాలయంలో రిపబ్లిక్ డే జాతీయపతాకావిష్కరణలో అసహనాన్ని కోపాన్ని దాచుకోలేకపోయారు. సొంత టివి ప్రత్యక్ష ప్రసారంలోనే ఆయన చికాకును వేలాదిమందిప్రేక్షకులు చూసేశారు. ఉత్సాహంగా జెండా తాడులాగగానే పచ్చరంగు పైన ఎర్రరంగు కింద కనబడి జెండాను తల్లకిందులుగా వేలాడదీసినట్టు బయటపడింది. ఇదే రాధాకృష్ణగారి అసహనానికి మూలం. జెండాను కిందికి దించిన సెక్యూరిటి ఉద్యోగి వెర్రి నవ్వు కూడా ఆయనకు చిర్రెత్తుకు రావడానికి ఒక కారణం కావచ్చు.

ఇలాంటి పొరపాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో జరిగినా మీడియా రోజంతా అదే దృశ్యాలు చూపిస్తూ నిర్వాహకుల్ని అదేపనిగా అవమానిస్తూవుంటుంది. ఇపుడు ఆదేస్ధితి ఓ మీడియా అధినేతకు ఎదురైంది.
ప్రత్యక్ష ప్రసారం (ఒక్కోసారి)ఎంత ఇబ్బందికరమో ఆయనకు అనుభవమై వుంటుంది. పొరపాటు ఎవరికైనా తప్పదు. దానికి ఏవేవో కారణాలు ఆపాదించి వ్యాఖ్యానాలతో హింసించడం ఎంత తొందరపాటో ఎంత బాధ్యతా రాహిత్యమో కూడా ఆయనకి అర్ధమై వుండాలి.
ఎంతో ప్రాముఖ్యమున్న విషయానికే ఉపయోగించవలసిన ప్రత్యక్ష ప్రసారాన్ని పనిలో పనిగా సొంతానికి వాడేసుకోవడం సరి కాదని కూడా ఆయనకు అవగతమై వుండాలి

దేశభక్తి ఒక స్ఫూర్తి అందుకు జెండా పండుగల వంటివి ప్రత్యక్ష రూపాలు. అసలు స్ఫూర్తే లేకుండా పండగలు చేస్తే జెండాలు తల్లకిందులవ్వడంలో ఆశ్చర్యంలేదు. స్ఫూర్తినింపే పని అపారమైన సంఖ్యలో ఉద్యోగులున్న ప్రభుత్వం వల్లకాదు. కొద్ది మందే సిబ్బంది వుండే ప్రతి సంస్ధలోనూ యాజమాన్యాలు పూనుకుంటే సాధ్యమే

Tuesday 22 January 2013

ధర్మానకి ఏది దారి?



దిక్కుతోచని  స్థితిలో  ధర్మాన ప్రసాదరావు 
తాజాగా వాన్‌పిక్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటూ..సిబిఐ కోర్టు తీర్పునివ్వడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


వాన్‌పిక్ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టు 13న దాఖలు చేసిన నాలుగో చార్జిషీట్‌లో ధర్మాన ప్రసాదరావును ఆరో నిందితునిగా చేర్చింది. తర్వాత ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆగస్టు 14 న ముఖ్యమంత్రికి లేఖను అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి చాలాకాలం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా చేసినప్పటి నుంచి ధర్మాన విధులకు హాజరుకావడం లేదు. ఆ శాఖకు సంబంధించిన ఫైళ్లన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

సీఎం తన రాజీనామా ఆమోదించనప్పటికీ తాను మంత్రిగా లేనని, కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నానని ధర్మాన పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇదిలా ఉండగా సుమారు రెండు నెలల క్రితం ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర కేబినె ట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిప్పిపంపడంతో ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితిలో ఉంది.

తాజాగా వాన్‌పిక్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటూ.. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో ప్రభుత్వం మరోసారి ఇరకాటంలో పడింది. తాజా పరిణామాలతో ధర్మాన రాజీనామా వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇలావుండగా.. తొలుత ధర్మాన ప్యాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ, ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించడంతో ధర్మాన రాజీనామా మరోసారి చర్చనీయాంశమైంది.

తాజాగా కోర్టు ధర్మానపై అభియోగాలను విచారణకు స్వీకరించడంతో సీఎం ఆయన రాజీనామాను ఆమోదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మాన ప్రాసిక్యూషన్ కొనసాగినా ఆయన సాంకేతికంగా పదవిలో కొనసాగేందుకు ఇబ్బందులు లేనందున రాజీనామాను యథాతథంగా పెండింగ్‌లోనే పెట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసినందునే ఆయన రాజీనామాను ఆమోదించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ విధంగా సాంకేతికాంశాలను పరిగణనలోకి తీసుకుంటే ధర్మాన రాజీనామా లేఖపై కిరణ్‌కుమార్‌రెడ్డి మరికొన్నాళ్లు వేచిచూసే అవకాశముందని చెబుతున్నారు. మరోపక్క ధర్మాన సీబీఐ కోర్టును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ధర్మానకి ఏది దారి?


మంత్రి ధర్మాన ప్రసాదరావు భయపడినంతా అయ్యింది. ఆయన కేసు విచారణ బోనెక్కింది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌లో మిణుకుమిణుకుమన్న ఆశలు ఆవిరైపోయాయి. ‘ఆ.. మాకేం భయం. సోనియా నుంచి సీఎం కిరణ్ వరకు అంతా అండగా ఉన్నారు’ అని ఇప్పటివరకు డాంభికాలు పలికిన వారంతా తాజా పరిణామాలతో నీరుగారిపోయారు. మంత్రిని విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. పార్టీ శ్రేణుల్లో కలవరం.. ఆగ్రహం సమపాళ్లలో పెల్లుబికాయి. నమ్ముకున్నవారిని పార్టీ నట్టేట ముంచేస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు.
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టైంది శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పరిస్థితి. అసలే రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్న ఆ పార్టీ మంత్రి ధర్మాన వ్యవహారంతో మరింతగా మసకబారనుంది. జిల్లా వ్యాప్తంగా కాం గ్రెస్ కార్యకర్త ల్లో పట్టున్న నేత మంత్రి ధర్మానే. 2009 నుంచి శత్రుచర్ల విజయరామరాజు మంత్రిగా ఉన్నప్పటికీ, జిల్లా కాంగ్రెస్‌లో ఎవరేమిటో ఆయనకు ఇప్పటికీ తెలీదు. ఇక ఏడాది క్రితం మంత్రి అయిన కోండ్రు మురళీగానీ, తాజాగా కేంద్రమంత్రి అయిన కృపారాణిగానీ జిల్లావ్యాప్తంగా పట్టు సాధించలేకపోయారు. వారిద్దరి రాజకీయ వ్యూహరచన సామర్థ్యంపైనా కార్యకర్తలకు నమ్మకం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఏకైక పెద్ద దిక్కు మంత్రి ధర్మానే. ఇప్పుడు ఆయనపైనే విచారణకు సీబీఐ కోర్టు అనుమతింది. దీంతో మంత్రి స్వయంగా చిక్కుల్లో పడ గా.. ఆయన్నే నమ్ముకున్న కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇది గ్రహపాటుగా మారింది. సీబీఐ కేసు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనకు అండగా ఉన్నాయన్న ఆశతో ఉన్న మంత్రి, కార్యకర్తలకు సైతం అదే చెబుతూ వచ్చారు. పార్టీ అధిష్టానంపై నమ్మకం లేకపోయినా ధర్మాన చెప్పడంతో ఇప్పటివరకు కాస్త ఆశతో ఉన్న కార్యకర్తలు తాజా పరిణామాల నేపథ్యంలో నిసృ్పహతో కుంగిపోయారు.

అధిష్టానం తీరుతోనే ఈ దుస్థితి
సీబీఐ కేసు విషయంలో పార్టీ అధిష్టానం తీరుపై కాంగ్రెస్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి ధర్మానకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ధర్మాన విచారణకు అనుమతివ్వకూడదన్న మంత్రివర్గ సహచరుల ఒత్తిడితో సీఎం కిరణ్ అయిష్టంగానే అంగీకరించారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే మంత్రి మండలి తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించిన తరువాత కిరణ్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారని అంటున్నారు. తద్వారా సీబీఐ వాదనకు పరోక్షంగా మద్దతు పలికారని ఆరోపిస్తున్నారు.

కాగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు పన్నిన కుట్ర కాంగ్రెస్‌కే తిప్పికొడుతోందని మంత్రి ధర్మాన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వై.ఎస్. హయాంలో జారీ చేసిన 26 జీవోలు సక్రమమేనని ప్రభుత్వం వాదిస్తే పరిస్థితి ఇంతగా దిగజారేదికాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సీఎం వినిపించుకోలేదని కూడా ధర్మాన నిష్టూరమాడినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కాపాడలేనంతగా పార్టీ పరిస్థితి దిగజారిందని...ఇక చేసేదేమీ లేదని కాంగ్రెస్ వర్గాలు నిసృ్పహ వ్యక్తం చేస్తున్నాయి.