పాకిస్థానీ సాహస బాలిక మలాలా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా
నిలిచింది. 2012వ సంవత్సరానికి గానూ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో
మలాలా పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైంది. పాకిస్థాన్‌లో బాలికల విద్యపై
పోరాటం చేస్తూ తాలిబన్లచే కాల్పులకు గురైన మలాలా లండన్‌లోని క్వీన్
ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చింది.
మలాలా ఆరోగ్యం
కుదుటపడటంతో ఎలిజబెత్ వైద్యులు శుక్రవారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. వచ్చే
నెలలో మలాలాకు క్రానియల్ రికాన్‌స్ట్రక్టివ్ సర్జరీ చేయనున్నట్లు డాక్టర్
డేవిడ్ రోస్సెర్ తెలిపారు.
తమ వైద్య బృందం సంప్రదింపులు జరిపి
వచ్చే నెల ఏ తేదీలో మలాలాకు శస్త్ర చికిత్స చేయవచ్చునని నిర్ణయిస్తామని,
అప్పటి వరకు మలాలా అవుట్ పేషెంట్‌గా తన కుటుంబీకులతో ఉండటం మంచిదనే
ఉద్దేశంతో ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు డేవిడ్ వెల్లడించారు.
No comments:
Post a Comment