ఆంధ్ర రచయితల రచయిత
March 4, 2013
ఆయనకు నన్నయపై భక్తి ప్రపత్తులు, గౌరవభావం ఎలాంటివో ఆయన రాసిన ఈ పద్యం చదివితే ప్రస్ఫుటమౌతుంది- ‘కాలంబెంత గతించి పోయినను ఆకల్పాంత సంస్థాయిగా/ నేలన్ నిల్వఁగఁ జూలు వ్యాస కవితా నిర్మాణమునన్ బాసలో/ నాలాపింపఁగ పంచ మ శృతి గరీయ స్వాదు సన్మాధురీ/ శ్రీలన్ నన్నయ కోకిలంబు సవరించెన్ గంటపున్కంఠమున్’ (ఎంతకాలము గడిచిపోయినప్పటికీ ఆకల్పాంతమూ స్థిరమైన వ్యాసకవి కృత జయమను పేరుగల మహాభారతాన్ని తెలుగు భాషలో ఆలపించుకునే విధంగా పంచమ శృతి (శృతి= వేదము, పంచమ శృతి= పంచమవేదము)లో సన్మాధురీ శ్రీలను నన్నయ అనే కోకిల గంటమనే కంఠంతో సవరించెను).ఒక అసమాన ప్రతిభాశాలి అయిన నన్నయకు మరో అసమాన ప్రతిభా శాలి అయిన మధునాపంతుల వారు ఇచ్చిన అపూర్వ నిర్వచనమిది.
మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తి, నన్నయ స్ఫూర్తిని మరింత ముందుకు తీసు కువెళ్లి నవీనాంధ్ర సాహితీలోకంలో సంప్రదాయ కవితాపరిరక్షణచేస్తూ అటు సంప్రదా యవాదులకు, ఇటు నవీనపథగాములకు ఆమోద యోగ్యమైన రచనలుచేశారు. ఆక్ర మంలోనే ఆంధ్రపురాణాన్నిరాసి ఆంధ్రోద్యమానికి ఎనలేని కృషిచేశారు. ఆంధ్రరచయి తలు అనే బృహత్కంగ్రంథం రాసి 113 మంది కవుల సాహిత్య జీవిత చిత్రణ చేశారు. మధునాపంతుల 1920 మార్చి 5న కోనసీమలోని ఐలెండ్ పోలవరంలో మాతామహు లు ఆకొండి రామమూర్తి శాస్ర్తి ఇంట జన్మించారు. ఆయన తండ్రి మధునాపంతుల సత్యనారాయణమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యునిగా గుర్తింపు పొందారు. సంస్కృతాం ధ్రభాషల్లో గణనీయమైన పాండిత్యాన్ని సముపార్జించారు.
మధునాపంతులకు చిన్ననాట తొలిగురువు ఆయన తండ్రే. ఆయన ప్రోత్సాహంతో, తనగురువైన పిఠాపురం సంస్థాన ఆస్థానకవి ఓలేటి వెంకటరామశాస్ర్తి ఆశీస్సులతో బాల్యంలోనే మధురమైన ఛందో బంధాలతో కవితలల్లి సత్యనారాయణశాస్ర్తి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇరవై యేళ్లు వచ్చేసరికే మధునాపంతుల చిక్కని పద్యరచన, చక్కని గద్య రచనలో ఆందెవేసిన చేయిగా పేరుపొందారు.
తమ స్వగ్రామం దగ్గరలోని ఇంజరం గ్రామం లోగల మహేంద్రవాడ సుబ్బరాయశాస్ర్తి సన్ని ధిలో వ్యాకర ణశాస్త్రాన్ని సంస్కృత నాటకాలం కారాలను అధ్యయనం చేశారు. 1940లో మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అదేఏడాది సర్ కట్టమంచి రామలింగారెడ్డి షష్ఠిపూర్తి వేదికపై మధునాపం తులవారి ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది.
ఆ సభకు సర్ సివి రామన్ అధ్యక్షులు. అంతకు ముందే చిలకమ ర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షతన కాకినాడలోజరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలలో ఒక అవిస్మరణీయ ప్రసం గాన్నిచేశారు. ఇదే ఆయన తొలిప్రసంగం. ఆసమయం లో ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టింది మధునా పంతులవారే. నన్నయ ప్రేరణతో ‘ఆంధ్రపురాణం’ రచించారు. ఈ కావ్యం మధునా పంతుల వారికి ఆంధ్రసాహిత్య అకాడమీ పురస్కృతిని అందించింది. అనన్యమైన ఆంధ్రాభిమానంతో మధునాపంతుల పంతొమ్మిదోయేట పల్లెప్రజల్లో విద్యాభివృద్ధికీ, విజ్ఞానదృష్టికీ కృషి సల్పారు. పల్లిపాలెంలో ఆంధ్ర కుటీరాన్ని ప్రారంభించారు.
1939 మార్చిలో ‘ఆంధ్రి’ అనే మాసపత్రిక ప్రారంభించారు.
ఈపత్రిక మూడేళ్ల పాటుమాత్రమే కొనసాగిసప్పటికీ ఆంధ్రసాహితీలోకానికి విశేషసేవలు అందించిం ది.1941 నవంబర్‌లో ఈపత్రిక ఆగిపోవడం విషాదవిష యమే.ఆనాటికి సుప్రసిద్ధులైన ఆంధ్రరచయితల జీవనరేఖలను వారి సాహితీప్రతిభతో కలిపి ‘ఆంధ్రి’ పత్రికలో వరుస గా ప్రచురించారు. ఇలా 44 మంది రచయితలగురించి 1944లో ‘ఆంధ్ర రచయితలు’ తొలి సంపుటిని ప్రకటించారు. ఆ తర్వాత 1950లో 101మంది రచయితల సాహిత్య జీవిత విశేషాలతో సమగ్రమైన సంపుటాన్ని ఆద్దేపల్లి అండ్‌కో వారు ప్రచురించారు. ఆయన కుమారులు సీనియర్ పాత్రికేయులు మధునా మూర్తి, మధునాపం తుల సత్యనారాయణమూర్తి, ఆయన మనుమడు మధునాపంతుల శేషాద్రి శేఖర్ ఈగ్రంథా న్ని పరిష్కరించి 113 మంది కవుల జీవిత సాహిత్య చిత్రణలతో ‘ఆంధ్ర రచయితలు’ బృహత్సంపుటిని సాహితీ ప్రపంచంముందు ఉంచారు.
ఇందులో ఎంతోమంది రచయితలు నేటితరాలకి పరిచయంలేనివారే. అటువంటి రచయితలు విస్మరులు కారని, తెలుగువారికి నిత్యసంస్మరణీయులని ఈ సంపుటిద్వారా మధునా పంతుల నిరూపించారు.
తెలుగులో బృహత్ నిఘంటువు ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు’ రూపకల్ప నలో మధునాపంతుల పాత్ర కీలకమైనది. 1942లో షడ్దర్శన సంగ్రహాన్ని, 1943లో ‘రత్నపంచాలిక’, ‘సూర్య సప్తతి’ ఇలా 1986 వరకూ మధునాపంతుల వారు ఎన్నో రచనలు చేశారు. వాటిలో ఆయనను ఉత్తమోత్తమ కవుల శ్రేణిలో నిలిపిన ‘ఆంధ్రపురాణం’ను 1954లో ప్రకటించారు. దీనికి కవిసామ్రాట్ విశ్వ నాధ సత్యనారాయణ విపుల పీఠిక రాశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న ఈకావ్యం సాహితీ విమర్శకులనుంచి ప్రశంసలందు కుంది.
తొమ్మిది పర్వాలతో అలరారే ఈ చారిత్రక కావ్యం ఆధునికాంధ్ర పంచ కావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈయన తొలి ఖండకావ్యం ‘తోరణము’. ఇది 1938లో వెలువడింది. మధునాపంతుల వారి మిగిలిన రచనల్లో ధన్వంతరి చరిత్ర,రత్నావళి నాటకము, బోధి వృక్షము నవల. చరిత్ర ధన్యులు, కళ్యాణ తార, స్వప్న వాసవదత్త, శ్రీఖండము, తెలుగులో రామాయణాలు, చైత్రరథ ము, సదాశివ పంచాంశిక, సాహిత్యవ్యాసాలు, కేళాకుళి, కథా పుష్కరిణి- నాలుగు భాగాలు, ప్రసంగ తరంగిణి వంటి అక్షర సంపద చాలా వరకూ అలభ్యం. వీటిని పునర్ముద్రించవలసి ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానములు, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు మధునాపంతుల వారి సంపాదకత్వంలో చాలా పుస్తకాలను వెలువరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనని ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించుకుంది. ఢిల్లీలో ఆలిండియా రేడియో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి కవి సమ్మే ళనంలో ఆయన తెలుగువారిపక్షాన వినిపించిన కవిత ఎందరి ప్రశంసలనో అందుకుంది. ఆనాటి ప్రపం చ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతులు మీదుగా 1975లో సన్మానాన్ని అందుకున్నారు. సర్వారాయ సాహితీ పురస్కారం, మహాంధ్ర జన పక్షాన రాజమండ్రిలో సన్మానం, ఆంధ్ర పురాణ రజతోత్సవం, అభిజనాభినందన ఇలా ఎన్నో సన్మానాలు, సత్కారాలు ఆయన జీవిత పర్యంతం అందుకున్నారు.
No comments:
Post a Comment