యుగాంతం టెన్షన్
న్యూయార్క్: డిసెంబరు 21 తర్వాత ఏం జరుగుతుంది ? ఆ ఏముంది... డిసెంబరు 22 వస్తుందని నాసా
ఘంటాపథంగా చెబుతోంది. యుగాంతం వార్తలను కొట్టిపారేసింది. దీనికి తగ్గ
సాక్ష్యాధారాలను బయటపెట్టింది. డిసెంబరు 21 సమీపిస్తున్న కొద్దీ అందరిలోనూ
ఒకటే టెన్షన్ . మాయన్ కేలండర్‌పై నమ్మకమున్నవారు నమ్మినవారు... ప్రత్యేక
పూజలు చేస్తున్నారు. యుగాంతాన్ని ఆపాలంటూ భగవంతున్ని వేడుకుంటున్నారు.
అటు... అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మాత్రం అంతా మామూలుగానే ఉంటారని
చెప్తోంది. యుగాంతంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ నాలుగు
నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేశారు. నాలుగు వందల కోట్ల ఏళ్ల నుంచి
భూమిపై జీవముందని... ఈ ఏడాది ప్రళయం వచ్చే చాన్సేలేదని నాసా ప్రకటించింది.
సుమేరియన్లు కనుగొన్న గ్రహం నిబిరు ... భూమివైపు దూసుకొస్తోందన్న
ప్రటనలతో మొదట ఆందోళన మొదలయ్యిందని నాసా శాస్తవ్రేత్తలు తెలిపారు.2003
మేలో ఘోర విపత్తు సంభవిస్తుందని జోస్యం చెప్పారని, కాని అటువంటిదేమీ
జరగలేదని వివరించింది. దీంతో కొంతమంది మయాన్ క్యాలెండర్‌తో ముడిపెట్టి
డిసెంబరు 21 యుగాంతంగా కథనాలు ప్రచారం చేస్తున్నారని సైంటిస్టులు
అభిప్రాయపడ్డారు. 1979లో కూడా స్కై లాబ్ ఒకటి కూలిపోయి... ప్రపంచం
అంతమవుతుందన్న వార్తలొచ్చాయి. అప్పట్లో దీన్ని జనం నమ్మారని... చివరకు ఏమీ
జరగలేదని గుర్తుచేస్తోంది. మయాన్లు... అప్పటికున్న టెక్నాలజీ బట్టి... ఏవో
కాకిలెక్కలు వేశారని నాసా కొట్టిపారేసింది. వారికి రెండు
కేలండర్లుండేవి... ఒక కేలండర్‌లో ఏడాదికి 365 రోజులుగా... మరో కేలండర్‌లో
260 రోజులుగా చూపించారు. మన భూగ్రహం మరో 400 కోట్ల సంవత్సరాలు నిక్షిప్తంగా
ఉంటుందని నాసా తెలిపింది.
--------------------------------
యుగాంతం ప్రచారంతో...
మాయన్ తెగకు ప్రచారం
న్యూయార్క్: యుగాంతం పుణ్యమాని... మాయన్ తెగకు ఎక్కడలేని ప్రచారం
వచ్చింది. మెక్సికోలో ఉన్న ఈ తెగవారిని, వారి సంస్కృతిని చూసేందుకు
పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు తమ పూర్వీకులు... యుగాంతం గురించి
ఎప్పుడూ చెప్పలేదంటున్నారు మాయన్లు... డిసెంబరు 21న భూమి అంతమవుతుందని
వస్తున్న వార్తలు... వెన్నులో చలిపుట్టిస్తున్నాయి. ప్రాచీన మాయన్ తెగ
కేలండర్‌లో ఈ విషయం ఉందంటూ చాలామంది వాదిస్తున్నారు. దీంతో మాయన్లు ఎవరని
తెలుసుకునేందుకు నెటిజన్లు ... సెర్చ్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా
మాయన్లుండే మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పం, టులం, కోబా పట్టణాలకు
వెళ్తున్నారు. ఇప్పటికీ 8 లక్షలమంది మాయన్లు ఇక్కడ ప్రశాంత జీవితాన్ని
గడుపుతున్నారు. యుగాంతంగా చెప్పే 2012 డిసెంబర్ 21 ... 5126 సంవత్సరాలకు
పూర్తయ్యే ఓ కాల వలయానికి సంకేతమంటున్నారు. ఆ రోజున యుద్ధం, సృష్టికి
కారణమైన తమ దేవుడు ... తిరిగివస్తాడని మాయన్లు నమ్ముతున్నారు. అందుకే
డిసెంబరు 21 గురించి ప్రపంచమంతా ఆందోళ చెందుతుంటే... మాయన్లు మాత్రం ఏ
టెన్షన్ లేకుండా ఉన్నారు.
క్రీస్తు శకం 300 నుంచి 600 మధ్యకాలంలో
మెక్సికోలో మాయన్ తెగ ఉండేది. వారెప్పుడు లాంగ్ కౌంట్ కేలండర్
ఉపయోగించలేదు. మత పెద్దలు, జోష్యులు మాత్రమే దాన్ని వాడేవారు.
--------------------------------
యుగాంతం ప్రచారంతో...
మాయన్ తెగకు ప్రచారం
న్యూయార్క్: యుగాంతం పుణ్యమాని... మాయన్ తెగకు ఎక్కడలేని ప్రచారం వచ్చింది. మెక్సికోలో ఉన్న ఈ తెగవారిని, వారి సంస్కృతిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు తమ పూర్వీకులు... యుగాంతం గురించి ఎప్పుడూ చెప్పలేదంటున్నారు మాయన్లు... డిసెంబరు 21న భూమి అంతమవుతుందని వస్తున్న వార్తలు... వెన్నులో చలిపుట్టిస్తున్నాయి. ప్రాచీన మాయన్ తెగ కేలండర్‌లో ఈ విషయం ఉందంటూ చాలామంది వాదిస్తున్నారు. దీంతో మాయన్లు ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ... సెర్చ్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా మాయన్లుండే మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పం, టులం, కోబా పట్టణాలకు వెళ్తున్నారు. ఇప్పటికీ 8 లక్షలమంది మాయన్లు ఇక్కడ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. యుగాంతంగా చెప్పే 2012 డిసెంబర్ 21 ... 5126 సంవత్సరాలకు పూర్తయ్యే ఓ కాల వలయానికి సంకేతమంటున్నారు. ఆ రోజున యుద్ధం, సృష్టికి కారణమైన తమ దేవుడు ... తిరిగివస్తాడని మాయన్లు నమ్ముతున్నారు. అందుకే డిసెంబరు 21 గురించి ప్రపంచమంతా ఆందోళ చెందుతుంటే... మాయన్లు మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఉన్నారు.
క్రీస్తు శకం 300 నుంచి 600 మధ్యకాలంలో మెక్సికోలో మాయన్ తెగ ఉండేది. వారెప్పుడు లాంగ్ కౌంట్ కేలండర్ ఉపయోగించలేదు. మత పెద్దలు, జోష్యులు మాత్రమే దాన్ని వాడేవారు.
------------------------------
No comments:
Post a Comment