Thursday 10 January 2013

లలిత స్వర కమలం
జేసుదాస్ స్వరార్ణవ రసాస్వాదనకు సుస్వాగతం ! సుస్వర స్వాగతం! జేసుదాస్ సంగీత రంగంలో ఉత్తుంగ తరంగం! స్వర శిఖరం! స్వర వినీలాకాశంలో ఆయనది తారా స్థాయి! ధృవ తారా స్థాయి!
జేసుదాస్ గా ప్రసిద్ధులైన కట్టస్సెరి జోసెఫ్ ఏసుదాస్ 1940 జనవరి పదవ తేదీన, భారతీయ సంగీత స్వర పతాకాన్ని విశ్వ వినీలాకాశ వీధుల్లో రెపరెపలాడించడానికే జన్మించిన గాన గంధర్వుడు!

తన సుదీర్ఘ స్వర ప్రస్థానంలో చేసిన రాగ ప్రస్తారాలు అనంతం! అసంఖ్యాకం! అనితరసాధ్యం! తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం,హిందీ, బెంగాలి, గుజరాతి, మరాఠి, ఒరియా, పంజాబి, సంస్కృతం, తుళు, మాలే,రష్యన్, అరబిక్, లాటిన్, ఆంగ్ల భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడారు! అస్సామీస్, కాశ్మీరీ భాషల్లో తప్ప ఆయన అన్ని భాషల్లో పాడారు! పాడుతున్నారు! కులమతాలకతీతంగా సంగీతమే తన భాష అని విశ్వమానవుడైన ఒక అపూర్వ స్వర మేరు శిఖరం జేసుదాస్! అయ్యప్ప పాటైనా, ఏసు ప్రభువు పాటైనా ఆ గళంలో ఆర్తిగొలిపే భక్తి! అనితర సాధ్యం! కేరళీయులకు మాత్రం ఆయన నడిచే సప్త స్వర స్వరూపం!

తండ్రి అగస్టీన్ జోసెఫ్ దగ్గరే, జీవితాలను ప్రభావితం చేయగల జీవితకాలపు స్వర ప్రస్థానంలో, సరిగమల తొలి అడుగులు నేర్చుకున్నారు. శ్రీ వేచూర్ హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద మలి పాఠాలు కొన్నాళ్ళు మధ్యమంలో అధ్యయనం చేసినా, తారా స్థాయి శిక్షణ మాత్రం విఖ్యాత శాస్త్రీయ సంగీత గురువు శ్రీ చెంబెయ్ వైద్యనాథ భాగవతార్ దగ్గర పొందారు!

శాస్త్రీయ సంగీతంలో స్వరార్ణవం ! లలిత సంగీతంలో స్వర వికసిత, రాగ విలసిత సలలిత లలిత ప్రియ కమలం ! హిందూస్థానీ సంగీతంలో సైతం ఆయన స్వర సింధువు ! ఇక సినీ సంగీతంలో ఆయన అసాధారణ సంచలనం!

నేపధ్య గాయకుడిగా 1960లలో స్వర ప్రస్థానం ప్రారంభించిన జేసుదాస్, 1970వ దశకం మధ్యలో బాలీవుడ్ లో అడుగుపెట్టి కొన్నేళ్ళపాటు మరో గాయకుడికి అవకాశం లేకుండా చేశారు. 1972లో ఆనంద్ మహల్ చిత్రంతో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసినా మొదట విడుదలైన చిత్రం సలీల్ చౌదరి సంగీతం అందించిన ఛోటీసి బాత్!
దాదా, చిత్ చోర్, సావన్ కో ఆనేదో, టూటే ఖిలోనే, మాన్ అభిమాన్, ఆలాప్, పాయల్ కీ ఝంకార్, హైసియత్, దౌడ్, త్రిశూల్, నైయ్యా, ఛోటీసీ బాత్, హత్య, అగర్, స్వామి తదితర హిందీ చిత్ర గీతాలతో సంచలనం సృస్టించి ప్రపంచ వ్యాప్తంగా, చెదిరిపోని, చెరిగిపోని, అభిమానాన్ని, అభిమానులను సంపాదించుకున్నారు. జేసుదాస్ సంగీత దర్శకుల అభిమాన గాయకుడు! ఉషా ఖన్నా, రవీంద్ర జైన్, రాజ్ కమల్, బప్పి లహరి, ఎ.ఆర్.రెహ్మాన్, ఖయ్యాం, సలీల్ చౌదరి, సోనిక్ ఓమి, ఋఅజేష్ రోషన్,జైదేవ్ తదితర హిందీ సంగీత దర్శకులు జేసుదాస్ గళ మాధుర్యాన్ని, స్వర విద్వత్తును, విద్యుత్తును తమ బాణీల్లో బంధించి, మామూలు ప్రపంచంలోకి స్వరామృత జలపాతాలు ప్రవహింపచేశారు.

నేపధ్య గాయకుడిగా జేసుదాస్ సాధించిన పురస్కారాల రికార్డును ఈ క్షణం వరకు ఏ గాయకుడూ సమానం చేయడమే కాదు, దరిదాపులకు కూడా రాలేకపోయారు. ఉత్తమ గాయకుడిగా ఏడు జాతీయ పురస్కారాలు సాధించారాయన! 2006లో చెన్నైలోని ఎవిఎం స్టూడియోలో, ఒకే రోజు జేసుదాస్, నాలుగు దక్షిణాది భాషల్లో పదహారు పాటలను రికార్డు చేశారు!

ప్రపంచవ్యాప్తంగా జేసుదాస్ అనేక ప్రముఖ నగరాల్లో కచేరీలిచ్చారు. 1965లోనే ఆయన రష్యా ప్రభుత్వ ఆహ్వానం మీద, రష్యాలోని వివిధ నగరాల్లో స్వర యాత్రచేసి, రేడియో కజగిస్థాన్ లో, రష్యన్ భాషలో పాట పాడారు. 2001లో సంస్కృతంలో అహింస అనే ఆల్బం పాడారు! లాటిన్, ఆంగ్ల భాషల్లో, ఫ్యూజన్ కలిపి, కర్ణాటక బాణీలో కూడా గానం చేశారు. గల్ఫ్ దేశాల సందర్శనలో ఆయన అరబిక్ పాటలను కర్ణాటక బాణీల్లో పాడేవారు. తరచుగా విదేశాల్లో పర్యటిస్తూ, భారతీయ స్వర సాంస్కృతిక రాయబారిగా వ్యవహరించేవారు!

కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడిగా, అధికారికంగా నియమితులైన ఏకైక గాయకుడాయన! 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ పురస్కారాలందుకున్నారు. 1999 నవంబర్ లో పారిస్ లో జరిగిన 'సంగీతంతో శాంతి కార్యక్రమంలో సంగీత రంగంలో శాంతిదూతగా విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.

ఇక తెలుగు చలన చిత్ర రంగంలో జేసుదాస్ గాత్రానికి మన సంగీత దర్శకులిచ్చే విశిష్ట స్థానానికి, ఆయన పాడిన పాటలే స్వర నిదర్శనం! 1976లో అంతులేని కధ చిత్రంతో మొదలైన ఆయన తెలుగు చలనచిత్ర నేపధ్య గాన యానం, ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా సాగుతోంది. కె.బాలచందర్, కె.విశ్వనాధ్ లాంటి ఎందరో దిగ్దర్శకులు ఆయన గాత్రంతోనే తమ కధలకు కొత్త వన్నెలు, చిన్నెలు దిద్దుకున్నారు. జేసుదాస్ పాట లేకుండా హీరో మోహన్ బాబు సినిమా తీయరు! తెర వెనుక జేసుదాసు పాటే తన సినిమాకు ఆశీస్సులు, కాసులు అని బలంగా నమ్ముతారు మోహన్ బాబు! సందర్భం కలిస్తే, తాను తలిస్తే జేసుదాస్ ప్రస్తావన లేకుండా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం, అదేనండీ, మన అభిమాన బాలు, జేసుదాసును తాను పాడే, తాను పాడించే ఏ స్వర కార్యక్రమంలోనైనా సభక్తికంగా తలచుకుంటారు.
ఈ రోజు జేసుదాసు పుట్టినరోజు! పుంభావ స్వర సరస్వతికి జన్మదిన శుభాకాంక్షలు! 

No comments:

Post a Comment