Friday 18 January 2013

మతం గతం

మనుషులుగా మనం బతకలేమా ??
 
మతం ముసుగులో కుమ్ములాటలు..........మతం ముసుగులో వోటు బ్యాంకు రాజకీయాలూ........అది ఏ పార్టీ ఐనా కావొచ్చు........ఎవరిచ్చారు వీరికి మనుష్యుల మనసులతో ఆడుకునే అవకాశామూ........అధికారమూ.......నువ్వూ నేనూ భాయి భాయి అనే ఆలోచనలు తుడిచేసి.........నీకు నాకు బై(bye) బై(bye) అనేలా ఉద్వేగపూరిత ప్రసంగాలతో వర్గ పోరు సృష్టించి......సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.......అన్య మతాలను గౌరవించమని ప్రతి మతం యొక్క అభిమతం.....అంతే కాదు భారత రాజ్యాగం కూడా మత స్వాతంత్ర్యపు హక్కులు ఇవ్వడమే కాకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదం (Secularism) అనే భావనను ప్రవేశ పెట్టి అన్ని మతాలూ, తమ తమ మత ప్రచారం చేసుకుంటూనే ఇతర మతాలను గౌరవించమని చెప్పింది..........మత ప్రచారం తప్పూ కాదూ , లోపమూ కాదూ......కానీ తమ మతమే గొప్పనుకోవడం తప్పు........ఒక మతం లో ఉన్న ఆచారాలూ, సాంప్రదాయాలూ వేరే మతం లో లేకపోవచ్చు.......అంత మాత్రాన నా మతమే గొప్ప అనే ధోరణితో ఉండొద్దు.......ఎవరి మత భావనలు వాళ్ల వాళ్ల వ్యక్తిగతం....ఈ రోజు నువ్వు వేరే మతాన్ని కించపరిస్తే , రేపు ఆ మతం వాల్లు నీ మతాన్ని కించపరుచొచ్చు.... పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించిన వాళ్లు మత విద్వేషాలకు లోనూ కారు అని మహాత్ములన్నారు...గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకునేల మత పెద్దలు కృషి చేయాలే తప్ప, మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు...విద్వేషాల వల్ల వ్యక్తిగతంగానే కాక సంఘ పరంగా, దేశ పరంగా కూడా కూడా అనర్థం..........మనిషి పుట్టి మతం పుట్టిందా, మతం పుట్టి మనిషి పుట్టాడ........ఆది మానవుడు ఏ మతంతో పుట్టాడు........వర్గ పోరు మాటలు దాటి, చేతల్లోకి వెళితే మన దేశ పరువేం కావలి.......సర్వ మత సమ్మేలనాలకు నిలయంగా.....ఆలయంగా వెలసిల్లిన నా భారతజాతి యొక్క ఔన్నత్యం, సమగ్రత కొందరు స్వార్థ రాజకీయ నాయకుల వల్ల దెబ్బ తినకూడదు.......ఏ ఒక్కరు విద్వేషపూరిత ప్రసంగాలు చెయ్యొద్దని, ప్రజలు ఆ విద్వేషపూరిత మాటల వల్ల ప్రేరేపితులు కావొద్దనీ......దేశ పరువు-ప్రతిష్టలని దిగజార్చకూడదనీ.........లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించడమనీ తెలుసుకొని......మత సామరస్యంతో శాంతియుత జీవితం గడపాలని భారతీయుడిగా మన రోదనా........ఆవేదనా.......... ఒక చిన్న కల్పిత కథ తో ఆ భావనను తెలుసుకుందాం............
ఆకాశంలో ఒకానొక రోజు కొందరు రాక్షసులు తిరుగుతూ భూమి వైపు చూస్తూ వాళ్ళలో వారు మాట్లాడుకుంటూ ఇలా అనుకున్నారు .....ఒరేయ్ జన్మలన్నింటిలోకి మానవజన్మ గొప్పదని అందరూ చెపుతుంటారు .........వారు చాలా ఐకమత్యంగా , సుఖసంతోషాలతో నివసిస్తారంట అని ఇంకో రాక్షసుడు అన్నాడు ....ఇదంతా నిజం కాదని మానవుల్లో కూడా మేం మనుషులమనే భావం తక్కువైపోయి వేరే ఆలోచలేవో వస్తునాయని ఇంకో రాక్షసుడు వాదించాడు ........ఆ వాదనలో నిజం ఉందని నిరూపించడానికి మన భారతదేశానికి ఒక విదేశీయుడి అవతారంలో వస్తాడు ......ఆ రాక్షసుడు.....అలా వచ్చిన రాక్షసుడు కొన్ని నెలలపాటు మన దేశం నలుమూలలా సంచరించి చాలా ఆశ్చర్యకరమైన విషయాల్నితెలుసుకున్నాడు ..........రాక్షసుడు మొదట మానవుల పేర్లతో పరిచయం చేసుకుందాం అనుకున్నాడు .....ఒకతని దగ్గరికి వెళ్లి నీవు ఎవరు?? అని అడగడంతో ఆ మనిషి నేనూ ‘‘హిందువు”అన్నాడు...అలాగే ఇంకొక మనిషి దగ్గరికి వెళ్లి అదే ప్రశ్న వేసాడు ... ఈ సారి సమాధానం ముస్లింగ వచ్చింది...ఇంకొక ప్రదేశానికి వెళ్లి అదే ప్రశ్న వేశాడు ... అక్కడి సమాధానం క్రిస్టియన్, అలా అనేకానేక ప్రదేశాలు తిరిగి అదే ప్రశ్నను వేయగా అతనికి దొరికిన సమాధానాలు ‘‘సిక్కు’’ ‘‘బౌద్ధుడు”, ‘‘ జైనుడు”........ఆ రాక్షసుడు మానవ జన్మలో ఇన్ని మతాలున్నాయా అని ఆశ్చర్యపోయాడు........అంతేకాదు తన వాదన నెగ్గుతుందన్న ఆశాభావం పెరుగుతున్నందుకు సంతోషించాడు......ఆ రాక్షసుడు ఈ మతవాద మానవుల్లో ఇంకా ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలు గమనించాడు ......ప్రతి మతంలోనూ ఎన్నో కులాలు, వాటిలోఉపకులాలు కూడా వున్నాయని....... అంతేకాదు ఒక మతం అంటే ఇంకో మతానికి పడకపోవడం ..ఒక కులానికి మరొకకులానికి పడకపోవడం గమనించాడు .....అంతే కాదు మా దేవుడు గొప్పని కొందరంటే , మా ప్రవక్తే గొప్పని కొందరంటారుకాదు .......కాదు మా ప్రభువే గొప్పని కొందరంటారు....ఇలా మనుషులు తమ మధ్యే కాకుండా దేవుళ్ళ మధ్యా గోడలుకట్టి మరీ, వారి దేవుడే గొప్పని ప్రచారం చేస్తున్నారు...ఇలా ఎన్నో నెలలపాటు పరిశీలనలు చేసిన ఆ రాక్షసుడికి తానుగెలిచినందుకు ఆనందంవేసినది.... కాని ఈ మానవుల్లో ఇంత వైషమ్యాలు ఎందుకున్నాయా అని ఆలోచించాడు. వీరినిఎలాగైనా మార్చాలని హిమాలయాల్లో ఘోర తపస్సుతో ఒక మునిగా అవతారం ఎత్తాడు. అలా అవతారం ఎత్తిన మునితాను హిందూ, ముస్లిం, క్రిస్టియన్,సిక్కు,బౌద్ద మరియు జైన వర్గాలకు చెందిన స్వామిజీని కాదని తాను ఒక “మనిషిని”మాత్రమేనని తనకు ఏ మతం, ఏకులం మరియు ఏజాతి రంగును అద్దవద్దని విజ్ఞప్తి చేస్తూ దేశమంతట సంచరిస్తూ అందరిని మనుషుల్లాగా బ్రతకమని హితబోద చేసాడు. మానవుల్లోని వైషమ్యాలను చూసి రాక్షసుడే తాను మారడమే కాకుండా మన విధివిధానాలు కూడా మార్చి మనల్ని మతాలకు కులాలకు అతీతంగా బ్రతకమనీ, మనుషులుగా మార్చాలని అనుకున్నాడు..... అలాంటిది మనంతట మనం మనుషులుగా బ్రతకలేమా?.......ఆలోచిద్దాం.......మతాన్ని గతం చేయలేమా?

No comments:

Post a Comment