Friday 18 January 2013

కవిత్వం

కవిత్వం......... తాత్వికానందం 

                  -  కె.శివారెడ్డి.


దుఃఖాన్ని ఏవగించుకుంటూ దూరంగా జరిగిపోతే, దుఃఖకారకాలను గుర్తించేదెలా? వాటికి పరిష్కారాల్ని కనుగొనేదెలా?అంటూ "దుఃఖం కంట్లో నీరై, కాంతిని వడబోస్తున్న్జ, కాంతిని కాపాడుతున్న లాంతరు గ్లాసై, నిన్ను బతికించి తాను బతుకుతుంది'' అంటారు కె.శివారెడ్డి. కవిత్వం రాసిన వారే అని కాదు ఆ స్థాయి అనుభూతులున్న ప్రతి ఒక్కరూ కవే అంటూ కవితాత్మ విస్తృతి చెబుతారాయన. నాలుగు దశాబ్దాల కాలంలో వచ్చిన ఆయన 14 కవితా సంకలనాల్లో మోహనా! ఓ మోహనా! అన్న కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తానొక కవితా శిఖరంగా ఎదగ డమే కాదు ఎంతో మంది నవతరం కవులకు ఆ కవితాస్పృహను పంచుతూ ఏడుపదుల వయసులోనూ ఒక ప్రవాహంలా సాగిపోతున్న కవి శివారెడ్డి జీవితంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఆయన మాటల్లోనే...........

గాయాలు శారీరకమే కావచ్చు, మానసికమే కావచ్చు కానీ కొన్నిసార్లు అవి ఎంత గొప్ప పాఠాలో చెబుతాయి. అయితే మనం ఎంతసేపూ వాటి వల్ల కలిగే కష్టనష్టాలే చూస్తాం. మనసు పెట్టి వినాలే గానీ ఒక్కోసారి అవి మనల్ని సమూలంగా మార్చివేస్తాయి . మనలో ఇంకా మిగిలి ఉన్న కాస్తో కూస్తో కాఠిన్యాన్ని కూడా తొలగించి, గొప్ప మార్దవాన్ని నింపుతాయి. అన్నిట్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్నుంచి అంతర్మూలాల్లోకి వెళ్లి అద్భుతాల్ని దర్శించే స్పృహనూ, శక్తినీ అందిస్తాయి. నా విషయంలోనూ ఇదే జరిగింది. చైతన్య ప్రవాహంఉద్యోగ విరమణ చేసిన రెండేళ్లకు అంటే 2001లో ఒక రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న సమయంలో ఒక స్కూటర్ నన్ను ఢీకొంది. నేల మీద పడిపోయిన నేను లేవడానికి ప్రయత్నించాను. కానీ కాలు లేవ డం లేదు. నా ఎడమ కాలు మడమ భాగమంతా నుజ్జనుజ్జయిపోయిందన్న విషయం నాకు ఆ తరువాత గానీ తెలియలేదు.

నన్ను చేర్పించిన హాస్పిటల్ డాక్టర్లు చెప్పిందాన్ని బట్టి ఏదో ఒక మేరకు ఆ కాలును తీసివేస్తారని, జీవితమంతా నేను కొయ్యకాలుతో నడవాల్సి ఉంటుందని అనుకున్నా. నాలుగు సర్జరీలు, సుదీర్ఘకాలం మంచాన విశ్రాంతి తర్వాత మళ్లీ నడవడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఆ రోడ్డు ప్రమాదం, తదనంతర పరిణామాలు నాకు చాలా విషయాలు చెప్పాయి. లోతైన పాఠాలు నేర్పించాయి. అందరిలా నడుస్తూ, జనప్రవాహంలో నేనూ మమేకమై ఉన్నప్పుడు ఆ ప్రవాహ చైతన్యం గురించి అంత లోతుగా తెలియలేదు. చైతన్యం సమాజమంతా ప్రవహిస్తున్నప్పుడు నేను చలనం కోల్పోయి మంచాన పడి ఉండి అప్పుడు ఆ చలనానికి సంబంధించిన అద్భుత అంశాలన్నీ ఒక్కొక్కటిగా తె లుసుకోవడం మొదలెట్టాను. నేను మంచాన పడిఉన్న ఆ రెండేళ్ల కాలంలో రాసిన కవితలే 'అంతర్జనం' పేరుతో ఆ తర్వాత పుస్తకంగా వచ్చాయి. వాస్తవానికి అప్పటిదాకా నేను రాసిన కవితలకూ, ఈ అంతర్జనంలోని కవితలకూ ఎక్కడా పొంతన కనిపించదు. నా భాష, వస్తువు సమూలంగా మారిపోయాయి.

ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు కూడా నేను సంచార జీవినే. ఉద్యమ శీలతతో జనప్రవాహంలో ఉన్న వాణ్ణే. కానీ, ఈ ప్రమాదం తరువాత నా చూపులో చాలా తేడా వచ్చింది. మనుషుల్లోకి, వస్తువుల్లోకి, ఘటనల్లోకి అన్నింటి అంతర్మూలాల్లోకి వె ళ్లడం ఆ ప్రమాదం నాకు నేర్పింది. 'అంతర్జనం' తర్వాత సాగిన నా కవితారచనలన్నిటిలో భాషాపరంగానూ, వస్తుపరంగానూ ఒక గుణాత్మకమైన మార్పు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే దృష్టి లోనికి వెళుతుందో గొప్ప సత్యసందర్శనం కలుగుతుంది. అంతకు ముందు నా కవితలో ఒక ప్రవాహ వేగం ఉండేది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత వచ్చిన కవితల్లో మరింత సాంద్రత, కవితాత్మకత వచ్చి చేరాయి. ఆ అనుభవం నుంచే సాహిత్య రచన వస్తువు చుట్టూ తిరగడం కాదు, వస్తువు లోనికి వెళ్లాలంటూ నేనొక సూత్రీకరణ చేశాను. గాయాలతో కుంగిపోవడం అనేది ఎప్పుడూ జరిగేదే. కానీ, గాయాలు నేర్పే పాఠాలు అన్నీ ఇన్నీ కావు. పాఠాల కోసం ఎవరూ గాయాల పాలు కావాలనుకోరు గానీ, అనివార్యంగా గాయమైపోయాక, ఆ పరిణామాల్లోకి నిశితంగా చూస్తే ఎన్ని అద్భుత సత్యాలో బోధపడతాయని, ఒక్కోసారి అది మన జీవ న దృక్పథాన్ని ఒక శిఖరానికి చేరుస్తుందన్న లోతైన నిజాన్ని ఆ రోడ్డు ప్రమాదం నాకు తెలియచెప్పింది.

ప్రవాహంలో ఉండాలని...
తెనాలి దగ్గరలో ఉన్న కార్మూరివారి పాలెం మా ఊరు. అప్పటికి ఏవో నాలుగు తెలుగు అక్షరాలు నేర్చుకుని ఉంటాను. ఆ సమయంలోనే అంటే నా ఆరే ళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నేనింక అక్షరం వేపు చూడలేదు. వంటచేయడం, పశువుల్ని కాయడం వీటితోనే నాకు సరిపోయింది. సాయంత్రం వేళ ఒకనాడు బంతాట ఆడుతున్న సమయంలో ఏదో ఘర్షణ జరిగి అవతలి జట్టుకు చెందిన ఒకడు నన్ను ఇంగ్లీషులో తిట్టాడు. అదే జట్టులో ఉన్న మా అన్నయ్యను వాడు ఏమని తిట్టాడో చెప్పమంటే చెప్పలేదు. నాలో ఒక కసి, కోపం పెరిగాయి. చదువుకోవాలన్న కోరికకు అది బీజం వేసింది. నాన్నగారిని ఒప్పించి నేను స్కూళ్లో చేరిపోయాను. అయితే ఆరవ తరగతిలోకి వచ్చాక గానీ, మాకు ఎబిసిడిలు నే ర్పలేదు. అందుకే 7వ తరగతిలోకి వెళ్లినా ఇంగ్లీషు వచ్చేది కాదు. ఆ ఇంగ్లీషు మాస్టారేమో రోజూ తిడుతూ ఉండేవాడు. హాయిగా ఏదో వ్యవసాయం చేసుకుని బతక్క ఎందుకీ బాధంతా అనుకున్నాను. స్కూలు మానేయాలన్న ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాను. అయితే ఆ మరుసటి రోజే ఇంగ్లీష్ మాస్టారు సాలె పురుగు గురించి ఒక పద్యపాఠం చెప్పాడు.

గూడు కట్టుకోవడంలో ఎన్నిసార్లు విఫలమైనా విజయం సాధించేదాకా అది నిర్విరామంగా పాటుపడే ఉదంతాన్ని ఆయన ఎంతో హృద్యంగా చెప్పాడు. ఒక చిన్న పురుగు అన్నిసార్లు ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించేదాకా వదల్లేదే! మనిషై ఉండీ నేనెందుకు నిరాశ చెందడం, వెనుకంజ వేయడం? అనిపించింది. అంతవరకు నాలోవున్న మీమాంస పటాపంచలైపోయింది. ఏది ఏమైనా చదువు కొనసాగించాలనే ఒక దృ«ఢమైన నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం నన్ను ఎం.ఏ. దాకా నడిపించింది. బిఏలో ఉన్నప్పుడే కవిత్వం పట్ల ఏర్పడిన ప్రేమ నన్ను ఎంఏ అయిపోగానే హైదరాబాద్‌కు వచ్చేలా చేసింది. నా ఆ రాక నా జీవితాన్నే మార్చివేసింది. మనిషి విషయ ప్రవాహమో, జనప్రవాహమో మొత్తానికి ఒక ప్రవాహంలో ఉండాలన్న సత్యాన్ని ఆ పరిణామాలు నాకు నేర్పాయి.

ముఖద్వారం వద్దే ఆగిపోయి....
ఒక సంచారిగా యువకవుల్ని కలవడానికి ఏ ప్రాంతానికి వెళ్లినా నాకు ఎప్పుడూ ఎదురయ్యే అనుభవం ఒకటుంది. అంతకు ముందెప్పుడో నేను కలిసినప్పుడు ఎంతో ఉద్వేగంతోనో కనిపించిన వాళ్లు, అంతే ఉద్వేగంతో కవిత్వం రాసిన వాళ్లు, సాహిత్య రంగంలో ఒక శిఖరానికి చేరతారనుకున్న వాళ్లల్లో ఎంతో మంది సాహిత్యానికి పూర్తిగా దూరమైపోవడం నేను చూశాను. కళాత్మకంగా ఉండలేకపోవడమే కాదు. మనుషులకు కూడా దూరమై, ఎక్కడో మగ్గిపోవడం చూశాను. నన్ను అన్నిటికన్నా అమితంగా బాధించే విషాదం ఇదే. ఒక కవి లేదా ఒక సృజనకారుడు తనను తాను బతికించుకోవడం ఈ రోజుల్లో క ష్టంగా ఉంది. హృదయగతంగా తనను తాను బతికించుకోవడం ఒక లక్ష్యంగా ఉండాలి. విషయాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా మందికి తెలియడం లేదు. అందుకే అర్ధంతరంగా ఆగిపోతున్నారు. ఏ ప్రయాణం అయినా బాలారిష్టాలను అధిగమించి , కొంత దూరం వెళ్లాక ఒక గొప్ప తాత్వికానందం కలుగుతుంది.

ఒకసారి ఆ ఆనందాన్ని పొందగలిగితే ఆ తర్వాత దాన్నించి పక్కకు వెళ్లాలనుకున్నా వెళ్లలేరు. ఆత్మానుభూతి అనంతంగా విస్తరిస్తూ, ప్రపంచాన్ని అల్లుకునే స్థితిలో ఎవరైనా తాము వెళుతున్న మార్గాన్ని ఎలా వదిలేస్తారు? బహుశా చాలా మంది ఆ స్థితి రావడానికి ముందే ఆ మహాసౌధపు ముఖద్వారం బయటనుంచే వెనక్కి వచ్చేస్తున్నారు. దుఃఖానుభూతి ఆనందానుభూతిగా మార్చుకోవడంలో విఫలం కావడమే ఈ స్థితికంతా కారణం. దుఃఖకారకాలను గుర్తించి, వాటిని అధిగమించినప్పుడే ఆ ఆనందానుభూతి సాధ్యమవుతుందని నా ఇన్నేళ్ల అనుభవం చెప్పింది.

గాడ్‌ఫాదర్‌లా...
ఏడేళ్ల క్రితం ఒకసారి కవి శిఖామణి వెంట వాళ్ల ఊరు యానాం వెళ్లాం. ఆ తర్వాత తిరిగి వచ్చేయడానికి కారు ఎక్కాం. అంతలో శిఖామణి వాళ్ల నాన్నగారు వచ్చారు. కొడుకును దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు... కారు కదిలింది. నాకు ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. వెక్కివెక్కి ఏడ్చేశాను. నాకు ఊహ తెలిసీ తెలియక ముందే చనిపోయిన మా అమ్మ గుర్తుకొచ్చింది. 80 ఏళ్లు బతికి చనిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. నా మనసులో ఎక్కడో నా బాల్యం ఇంకా బతికి ఉందేమో అందుకే పొగిలిపొగిలి ఏడ్చాను. ఆయన బతికి ఉన్నన్నాళ్లూ తెలియని ఏదో ధైర్యం ఒకటి నాలో ఉండేది. మా నాన్న పోయాక ఏదో ఒంటరితనం నన్ను ముసురుకుంది. ఏ తల్లిదండ్రులైనా ఎంతకాలం ఉంటారు? వెనకో ముందో అందరూ వె ళ్లిపోతారు. మొత్తంగా కాకపోయినా ఎంతోకొంత ఆ ఖాళీని పూరించే మరో హృదయం, ఒక ఆత్మీయ హస్తం ఉంటే ఎంత బాగుండునో కదా అనిపించింది.

ఆ భూమికేదో నేను కూడా పోషించాలనిపించింది. అందుకే కవిగానే కాకుండా నాకంటే బాగా చిన్నవాళ్లయిన చాలామంది కవులకు నేనొక ఫాదర్‌లా ఉంటాను. గాడ్‌ఫాదర్‌లా ఉంటాను. ఆ ఆత్మీయతను పంచడానికి రక్తసంబంధమే ఉండనవసరం లేదు కదా! చనిపోయిన వాళ్లను వారికి తిరిగి ఇవ్వలేం. కానీ, మన ఆత్మీయ స్పర్శతో పోయిన ఆ బంధాల్లోకి ప్రవేశిస్తాం. విస్తరిస్తాం. ఒక్కోసారి ఆ రక్తబంధం కన్నా ఈ బంధమే గొప్పగా ఉండవ చ్చు. వాళ్ల జీవితంలో ఏర్పడిన ఖాళీని ఆశించిన దానికన్నా గొప్పగానూ పూరించవచ్చు. ఎవరి స్థాయిలో వారు ఆ ఖాళీని భర్తీ చేసే బాధ్యతను తీసుకోవడం చాలా అవసరమన్న ఒక ఆ్రర్దమైన సత్యాన్ని నా జీవితం నాకు నే ర్పింది.

No comments:

Post a Comment