Monday 28 January 2013

జాతీయ జెండాను తిరగేసిన..........

జాతీయ జెండాను తిరగేసిన ఆంధ్రజ్యోతి సిబ్బంది

 


ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ టివి ల అధినేత, పాత్రకేయుడు రాధాకృష్ణ తన కార్యాలయంలో రిపబ్లిక్ డే జాతీయపతాకావిష్కరణలో అసహనాన్ని కోపాన్ని దాచుకోలేకపోయారు. సొంత టివి ప్రత్యక్ష ప్రసారంలోనే ఆయన చికాకును వేలాదిమందిప్రేక్షకులు చూసేశారు. ఉత్సాహంగా జెండా తాడులాగగానే పచ్చరంగు పైన ఎర్రరంగు కింద కనబడి జెండాను తల్లకిందులుగా వేలాడదీసినట్టు బయటపడింది. ఇదే రాధాకృష్ణగారి అసహనానికి మూలం. జెండాను కిందికి దించిన సెక్యూరిటి ఉద్యోగి వెర్రి నవ్వు కూడా ఆయనకు చిర్రెత్తుకు రావడానికి ఒక కారణం కావచ్చు.

ఇలాంటి పొరపాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో జరిగినా మీడియా రోజంతా అదే దృశ్యాలు చూపిస్తూ నిర్వాహకుల్ని అదేపనిగా అవమానిస్తూవుంటుంది. ఇపుడు ఆదేస్ధితి ఓ మీడియా అధినేతకు ఎదురైంది.
ప్రత్యక్ష ప్రసారం (ఒక్కోసారి)ఎంత ఇబ్బందికరమో ఆయనకు అనుభవమై వుంటుంది. పొరపాటు ఎవరికైనా తప్పదు. దానికి ఏవేవో కారణాలు ఆపాదించి వ్యాఖ్యానాలతో హింసించడం ఎంత తొందరపాటో ఎంత బాధ్యతా రాహిత్యమో కూడా ఆయనకి అర్ధమై వుండాలి.
ఎంతో ప్రాముఖ్యమున్న విషయానికే ఉపయోగించవలసిన ప్రత్యక్ష ప్రసారాన్ని పనిలో పనిగా సొంతానికి వాడేసుకోవడం సరి కాదని కూడా ఆయనకు అవగతమై వుండాలి

దేశభక్తి ఒక స్ఫూర్తి అందుకు జెండా పండుగల వంటివి ప్రత్యక్ష రూపాలు. అసలు స్ఫూర్తే లేకుండా పండగలు చేస్తే జెండాలు తల్లకిందులవ్వడంలో ఆశ్చర్యంలేదు. స్ఫూర్తినింపే పని అపారమైన సంఖ్యలో ఉద్యోగులున్న ప్రభుత్వం వల్లకాదు. కొద్ది మందే సిబ్బంది వుండే ప్రతి సంస్ధలోనూ యాజమాన్యాలు పూనుకుంటే సాధ్యమే

1 comment: