Sunday 6 January 2013

నిర్భయ స్నేహితుడి ఆవేదన

కొవ్వొత్తులతో

మనుషుల మైండ్‌సెట్ మారుతుందా?

*ఒక్కరు స్పందించినా పరిస్థితి వేరేలా ఉండేది
*ఉరికాదు.. సజీవ దహనమే ఆమె డిమాండ్
*నిద్రలేని రాత్రుళ్లు గడిపా..

 న్యూఢిల్లీ, జనవరి 6: "కొవ్వొత్తుల ప్రదర్శనలతో మనుషుల వైఖరిని మార్చలేరు. రోడ్ల పక్కన సహాయం కోసం ఎదురు చూసే వారిని ఆదుకోండి! ఆ రోజు ఒక్కరు మా మొర ఆలకించి ఉన్నా... పరిస్థితి భిన్నంగా ఉండేది''... ఇది ఢిల్లీ అత్యాచార ఘటనలో దుండగుల చేతిలో దెబ్బలు తిన్న నిర్భయ స్నేహితుడు చెప్పిన మాట! డిసెంబర్ 16వ తేదీ రాత్రి బస్సులో అఘాయిత్యానికి పాల్పడుతూ... రెండున్నర గంటలపాటు దేశ రాజధానిలో తిరిగారని, బస్సులోంచి తోసేసిన తమను ఆదుకున్న వారే లేకపోయార ని అతను వాపోయాడు. ఆ రోజు జరిగిన సంగతులను వివరిస్తూ నిర్భయ స్నేహితుడు ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలివి...
 "ఈ దుర్ఘటన జరిగిన తర్వాత మా కుటుంబ సభ్యులు నన్ను మా ఊరికి వెళ్లిపొమ్మన్నారు. కానీ... ఈ కేసు విషయంలో పోలీసులకు సహకరించేందుకే నేను ఢిల్లీలో ఉన్నాను. ప్రైవేటు ఆస్పత్రిలో, నా సొంత ఖర్చులతో చికిత్స పొందాను. ప్రభుత్వం నుంచి ఎలాం టి సహాయం లభించలేదు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఒక్కసారి నిర్భయను కలిశాను. ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష వేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ... నిర్భయ డిమాండ్ అది కాదు. వారిని సజీవ దహనం చేయాలన్నది ఆమె ఆకాంక్ష. నిర్భయ మహిళా న్యాయమూర్తికి చాలా కష్టంమీద వాంగ్మూలం ఇచ్చింది.

విపరీతంగా దగ్గు వస్తున్నా, రక్తం స్రవిస్తున్నా ఆమె కష్టపడి వాం గ్మూలం ఇచ్చింది. కానీ... నిర్భయ ఒత్తిడికి లోనైందని మెజిస్ట్రేట్ చెప్పడంతో, ఆమె శ్రమంతా వృథా అయ్యింది. మరోసారి వాం గ్మూలం ఇవ్వాల్సి వచ్చింది. కానీ, ఆమె మొదటిసారి ఇచ్చిన వాం గ్మూలమే సరైనది. పోలీసుల తీరు కూడా మారాలి. ముందు బాధితులకు సత్వరం వైద్య చికిత్స అందించాలి. ఈ కేసులో పోలీసులవైపు నుంచి ఎలాంటి లోపంలేదని, బాగా పనిచేశారని చెప్పాల్సిందిగా నన్ను కొందరు అధికారులు అడిగారు. ఎవరి పని వారు చేసినప్పుడు... మళ్లీ క్రెడిట్ కోరుకోవడం ఎందుకు?

నిర్భయ ఘటన నేపథ్యంలో చట్టాలు మార్చాల ని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలంటున్నారు. మనకు ఇప్పటికే చాలా చట్టాలున్నాయి. అయినా పోలీసు లు కేసు నమోదు చేస్తారో, లేదో కూడా తెలియని పరిస్థితి. ఒక్క అంశం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పె డ తామంటున్నారు! నిజానికి... అన్ని కేసులను శరవేగంగా పరిష్కరించాలి. ఇదే విషయాన్ని జస్టిస్ వర్మ కమిటీకి చెబుతాను. జనం కూడా మారాలి. నేను, నిర్భయ సహాయం కోసం రోడ్డు పక్కన ఎం తగానో అర్థించాం. చాలామందికి కార్లున్నాయి. వారిలో ఏ ఒక్కరైనా ఆగి, మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లవచ్చు. కానీ... ఎవ్వరూ ఆ పని చేయలేదు. ఈ వైఖరిని మార్చేదెవరు? ఆ రోజు ఒక్కరు మాకు సహాయం చేసిఉన్నా, పరిస్థి తి వేరుగా ఉండేది. ఈ సంఘటన శారీరకంగానేకాదు, మానసికంగానూ నన్ను దెబ్బతీసింది. రాత్రిళ్లు నిద్ర రాలేదు. రెండు వారాలపాటు కనీసం ఎవ్వరితో మాట్లాడలేకపోయాను. ఇదంతా నా వల్లే జరిగిందా? షాపింగ్ మాల్‌కు ఆ రోజు ఎందుకు వెళ్లాం? ఎందుకు ఆ బస్సెక్కాం? వంటి ప్రశ్నలు వెంటాడాయి.


నిర్భయకు మొదటి నుంచే మంచి చికిత్స లభించి ఉంటే... బహుశా ఆమె బతికేదేమో! ఆ సమయంలో నిర్భయను వదిలి నేను మాత్రమే తప్పించుకోవాలన్న ఆలోచన ఇసుమంతైనా రాలేదు. జంతువులు కూడా అలాం టి పని చేయవు. ఏది ఏమైనా... ఆమె అందరినీ మేల్కొల్పింది. ఈ పోరాటాన్ని కొనసాగించడమే ఆమెకు సరైన నివాళి''.

No comments:

Post a Comment