Tuesday 18 December 2012

12/18/2012 Namastheandhra.com | News all the way...

తెలుగు సభల్లో ‘మిథునం’





తనికెళ్ల భరణి ప్రతిష్టాత్మకంగా శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో తీసిన ‘మిథునం’ చిత్రం ఈ నెల 27 నుండి తిరుపతిలో మొదలయ్యే ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శించనున్నారు. ప్రపంచ తెలుగు సభల్లో జానపదాలు, పౌరాణికాలు, సురభి నాటకాలు, పలు చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ సభలకు సంబంధించి ప్రత్యేకంగా తెలుగు వైభవం ఉట్టిపడేలా, తెలుగు భాష వైభవం ప్రపంచానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి.
ఈ విషయాన్ని తనికెళ్ల భరణి తెలియజేస్తూ ”ఇద్దరు వృద్ధ దంపతుల ప్రేమకథగా ‘మిథునం’ను తీర్చిదిద్దాం. ఇందులో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి నటించారు. సినిమా అంతా వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రారంభ చిత్రంగా ‘మిథునం’ను ఎంపిక చేయడం మా అదృష్టం. కచ్చితంగా తెలుగు వారందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది” అన్నారు.

No comments:

Post a Comment