Friday 21 December 2012

ధర్మానను ఎందుకు వెనుకేసుకువస్తారు?

:సీఎం పై మండిపడ్డ డీఎల్ 

 

హైదరాబాద్, డిసెంబర్ 21 : 
ధర్మాన ప్రాసిక్యూషన్ వ్యవహారంపై మరోసారి కాంగ్రెస్‌లో చిచ్చురేగింది. ధర్మాన రాజీనామా ఫైలును గవర్నర్ తిప్పిపంపడంతో తదుపరి చర్యలపై పలువురు మంత్రులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరుపుతున్న సమయంలో మరో మంత్రి డీఎల్ సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేసారు. సీబీఐ, కోర్టుల తప్పు చూపినప్పటికీ ధర్మానను ఇంకా వెనుకేసుకు రావడం సరికాదని మండిపడ్డారు.
ధర్మాన విషయంలో గవర్నర్ సూచన ప్రభుత్వానికి ఇబ్బందికరమే అన్నారు. కేబినేట్ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదన్నారు. సబంధిత శాఖ-మంత్రికి సంబంధం లేకపోతే ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని డీఎల్ గుర్తుచేశారు. మరోసారి ధర్మాన ఫైలు కాబినేట్ ముందుకు వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సహచర మంత్రిగా ధర్మానపై ప్రాసిక్యూషన్ కోరానన్న బాధ తనకు ఉందని మంత్రి డీఎల్ రవీందర్‌రెడ్డి అన్నారు.

No comments:

Post a Comment