Wednesday 19 December 2012

తెలుగు మీడియా నిజాలు



 నిజాయితీతో పనిచేసే  జర్నలిస్టుకు అండ ఎవరు?

రిపోర్టర్ అని గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఇప్పుడు నీరసం వచ్చింది. దారుణ పరిస్ధితులు దాపురించాయి.
1. వార్త జీతాలు ఎప్పుడిస్తుందో ఎవరికీ తెలియదు
2. భూమిలో స్ట్రింగర్స్ కి డబ్బులు ఇవ్వటం మానేశారు, అడిగితే ఆర్ధిక సంక్షోభం పేరు చెబుతున్నారు.
3. టీ వీ 9 లో పెద్ద జీతగాళ్లని అందరినీ జాగ్రత్త గా బయటకి పంపిస్తూ భద్రత కి భరోసా లేదని తేల్చేశారు
4. ఈనాడులో ఈ టీ వీ లో ఎంత పని చేసినా ఎదుగుదల జీతం లో అప్పుడప్పుడు మినహా పదోన్నతులలో ఉండదని పనిలో చూపెడుతున్నారు.
5. జ్యోతిలో ఎవరి పైన ఎవరిని పెదతరో ఎవరికి తెలియదు, పనికంటే ఆయింట్ మెంట్ రాసేవాళ్ళకి, కలెక్షన్లు చేసి పైకి సమర్పించుకునే వాళ్లకే గిరాకీ ఎక్కువ
6. ప్రభలో వార్తలు డెప్త్ గా రాసే వారు ఉంటే వాళ్ళని ఎలా దెబ్బ తీయాలా అని చూసే రాజకీయాలతో సరిపోతుంది.
7. ఎన్ తీ వీ, టీ వీ 5 యాజమాన్యాలు వ్యాపారులవి కావటంతో జీతాల లో తమకి కావలసిన పనికి వచ్చే వాళ్ళకి అధికంగా ఇచ్చుకోవటం. ఏ రోజు ఏ పార్టీకి బాకా ఊదమంటే అలా ఊదే వార్తలు రాయగలగలగటం ముఖ్యం
8. మహా టీ వీ వీలున్నప్పుడు జీతాలు ఇస్తుంది
9. హెచ్ వై టీ వీ మూసేసి జీతాలు ఇవ్వకుండా తిప్పుతూ చాలా రోజులు అయ్యింది
10. హెచ్ ఏం టీ వీ కపిల్ చిట్స్ దయవల్ల బ్రతుకుతున్నా పాతకాలపు ప్రింట్ మేడియా చదస్తాల నుండి బయటకి రాలేదు
11. సే వీ ఆర్ లో రావు గారిని కాకాపడితే ఉద్యోగం, లేదంటే నిరుద్యోగం. వ్యాపారాలలో బాగంగా తప్ప వృతి గురించి తెలిసి చక్కగా పని చేయించటం ఎవరికి తెలియదు
12. జెమిని న్యూస్ చానల్ ఇంతవరకు హైదరాబాద్ లో కనిపించదు, ప్రధాన కేంద్రాలలో ఎక్కడో మూల పాడేసి ఉంటుంది. కేబల్ వాళ్ళతో పెట్టించటం కూడా చేతకాదు. గుప్పెడు సిబ్బందితో సముద్రమంత పని చేయించాలని చూస్తూ ఉంటుంది. వార్తలలో ఆర్భాటం ఎడిటింగ్ ప్రమాణాలలో, సాంకేతికతతో పూర్.
13. జీ 24 బొత్స కి బాకా ఉదాలా/తెలంగాణ వాదం కొనసాగించలా అన్న తపనలో తల్లడిల్లిపోతోంది. మంచి పాత్రికేయ బృందం ఉన్నా ఆర్ధిక సంక్షోభంతో రాజకీయ చేతికి చేరింది.
14. టీ న్యూస్, వీ - 6 వాదాలతో కాలక్షేపం మినహా జనం కోసం వార్తలు రాయగల ధమ్మున్న రిపోర్టర్లు కరువు. బకాలుదే వారికే పట్టం.
15. సాక్షి జగన్ అభిమానం, అక్కడున్న పీద్దలని కాకా పట్టడం ముఖ్యం. ఎవరు బాసో ఎవరికి తెలియదు. పెద్ద జీతగాళ్లని ఇప్పటికే సగం తరిమేసింది
మొత్తం మీద ఆర్ధిక సంక్షోభం అన్నీ చానల్స్ అక్కడి సిబ్బందికి బద్రతని దూరం చేసింది. వృత్తి నైపుణ్యం ఉండి ఎదగలనుకునే వారికి మీడియా ఒక పెద్ద అగాధంగా మారింది. ఆదే నేతలకి చులకన అయ్యింది. వెటకరంగా మాట్లాడే స్ధితికి తెచ్చింది.

2 comments:

  1. వి6 న్యూస్ లో సీమాంధ్రలో కెమెరామెన్లను తొలగించి వారికి జీతాలు, పి.ఎస్. ఇంకా చెల్లించలేదు దాని మీద కొంచెం దృష్టి పెట్టగలరు తెలుగు మీడియా నిజాలు గారూ

    ReplyDelete
  2. వి6 న్యూస్ లో సీమాంధ్రలో కెమెరామెన్లను తొలగించి వారికి జీతాలు, PF. ఇంకా చెల్లించలేదు దాని మీద కొంచెం దృష్టి పెట్టగలరు తెలుగు మీడియా నిజాలు గారూ

    ReplyDelete