Thursday 20 December 2012

ఘన విజయం

గుజరాత్‌లో మోడీ హ్యాట్రిక్:  ఇక ప్రచారం కోసం తెలంగాణకు

* భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

 (అహ్మదాబాద్-న్యూస్ మీడియా): 
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయం సాధించడంతో కేవలం ఆ రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఆంధ్ర ప్రదేశ్ బిజెపి క్యాడర్‌లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. గుజరాత్ విజయంతో ఎపి బిజెపి కార్యాలయంలో నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఘన విజయం సాధించిన మోడీని వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రచారం కోసం రాష్ట్రానికి తీసుకు వస్తామని చెబుతున్నారు. బిజెపి ఇప్పటికే రాష్ట్ర విభజనపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతోంది. సీమాంధ్రలోనూ ప్రత్యేకాంధ్ర కోసం పోరాటం చేస్తోంది. రాష్ట్ర విభజనపై బిజెపి స్పష్టమైన వైఖరితో ఉంది. విభజన వాదంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునే ప్రయత్నాలు బిజెపి చేస్తోంది. సీమాంధ్రలో బిజెపి గెలిచే అవకాశాలు తక్కువు. తెలంగాణలోనే గెలుపుపై ఆశలు పెట్టుకుంది. దీంతో మూడోసారి హ్యాట్రిక్ కొట్టి మరోసారి గుజరాత్ గద్దెనెక్కిన దేశవ్యాప్తంగా తన ఆదరణను నిరూపించుకున్న మోడీని తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేయించి లబ్ధి పొందాలని భావించనున్నదని తెలుస్తోంది. మోడీని తీసుకు వచ్చి కనీసం ఐదారు జిల్లాల్లో ప్రచారం చేయించాలని భావిస్తోందని సమాచారం. గుజరాత్‌లో చేసిన అభివృద్ధి తదితర అంశాలను మోడీ తన ప్రచారంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అలాగే బిజెపిని గెలిపిస్తే తెలంగాణ ఇస్తామని చెప్పించనున్నారు. వెంకయ్య నాయుడు మోడీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పి, అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చాపురాని అందుకే మూడోసారి గెలుపొందారని వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని వర్గాల వారికి ఆ రాష్ట్రంలో ఫలాలు అందాయని, ముస్లింల తలసరి ఆదాయం గుజరాత్‌లోనే ఎక్కువగా ఉందని, ఆరుకోట్ల గుజరాత్ ప్రజల అభివృద్ది ధ్యేయం అన్న మోడీని గుజరాత్ ప్రజలు అందలమెక్కించారన్నారు. విద్యాసాగర రావు మెడీ గెలుపు అభివృద్ధికి సూచిక అని విద్యాసాగర రావు అన్నారు. దత్తాత్రేయ మోడీ చేసిన అభివృద్ధిని చూసే గుజరాత్ ప్రజలు మరోసారి బిజెపిని గెలిపించారని, 12 ఏళ్ల మోడీ అవినీతి రహిత పాలనకు ఇది నిదర్శనమని, అన్ని వర్గాలకు ఫలాలు అందాయని దత్తాత్రేయ అన్నారు. కిషన్ రెడ్డి మోడిపై విపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా గుజరాత్ ప్రజలు అర్థం చేసుకొని బిజెపికే పట్టం కట్టారన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడి సరైన అభ్యర్థి అని తాను భావిస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు.

No comments:

Post a Comment