Tuesday 18 December 2012

స్థానికంలో మహిళలకు 50 శాతం: సీఎం

విశాఖపట్నం, డిసెంబరు 17:
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, అభయహస్తం పథకంలో కొత్తగా 1.20 లక్షల మందిని చేరుస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నం జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి ఏయూ సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. విశాఖ బీచ్‌ రోడ్డులో రాజీవ్‌ స్మృతి భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఇందిర క్రాంతి పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు లబ్ధి పొందారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఇందిరమ్మబాట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విశాఖ జిల్లాలోని మల్కాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. మహిళలు బ్యాంకుల నుంచి రూ. 13 వేల కోట్ల రుణాలు తెచ్చుకుంటున్నారని.. ఇది రాష్ట్రంతోపాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. మహిళలకు రుణాలు ఇస్తే తిరిగి చెల్లిస్తారనే నమ్మకాన్ని బ్యాంకులు వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి సెంట్రల్‌ విశాఖకు 24 గంటలు నీటి సరఫరా చేసే ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇందిరమ్మ బాటలో భాగంగా మంచినీటి పథకానికి శంకుస్థాప చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. మల్కాపురంలో శివారు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 24 గంటల తాగునీటి పథకానికి ముఖ్యమంత్రి శంఖుస్థాప చేసి ఇందిరమ్మబాటకు శ్రీకారం చుట్టారు. 83.49 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మంచినీటి సరఫరా పథకం వల్ల ఈ ప్రాంత ప్రజలు అదృష్టవంతులని ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలో దశల వారీగా అన్ని ప్రాంతాలకు మంచినీటిని 24 గంటలూ సరఫరా చేస్తామని చెప్పారు. బహిరంగ సభకు హాజరై మహిళా సోదరీమణులను చూసి, మహిళలు ఆర్థికంగా ముందడుగు వేసిన తీరును ముఖ్యమంత్రి అభినందించారు. ఇందిర క్రాంతి పథకం ప్రారంభించిన తరవాత మహిళలు జీవితంలో ముందడుగు వేసి ఆర్థికంగా కుటుంబాలను పోషించుకొంన్నారన్నారు. ఈ ఏడాది 13 వేల కోట్ల రూపాయ/హల రుణాలు అర్బన్‌, రూరల్‌ ఐ.కె.పి. మహిళలు పొందుతున్నారని, ఇంత పెద్ద ఎత్తున రుణ సౌకర్యం పొందుతున్న మహిళలు సమాజంలో మరింత ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

మీ దగ్గరకే వస్తున్నాం....

ప్రతి వ్యక్తికి సమస్యలుంటాయని, అదే విధంగా సమాజంలో అనేక సమస్యలు ఉంటాయని... వాటిని పరిష్కరించేందుకు నేను మీ దగ్గరకు వస్తున్నానని ముఖ్యమంత్రి వివరించారు. అయితే.. అన్ని సమస్యలు ఒకే సారి పరిష్కరించడం సాధ్యంకాదని, అందుకే.. ఒక్కో సమస్య పరిష్కరిస్తూ ఇందిరమ్మబాట సాగుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల సమస్యలు చెప్పారని, వాటన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. విశాఖలో అనుకూలమైన స్థలం ఉంటే... స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామన్నారు. యురవతకు ఆటల్లో పోటీతత్వం పెంచడం అవసరమన్నారు. అప్పుడేవారు జయాపజయాలను అర్థం చేసుకోగలరన్నారు. అన్ని నియోజకవర్గాల్లో రూ.220 కోట్లతో స్పోర్ట్స్‌ స్టేడియాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇందిరమ్మ అమృత హస్తం:

కొత్తగా ప్రవేశపెట్టి ఇందిరమ్మ అమృత హస్తం పథకం వల్ల 25 వేల ఐ.సి.డి.ఎస్‌.లకు

చెందిన 3.50 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్ఠికాహారంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, ఇంత మంచి సహాయం ఏ ప్రభుత్వాలు చేయలేదని

ముఖ్యమంత్రి వివరించారు. ప్రతి సంవత్సరం 65 వేల మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మించి చనిపోతున్నారని, ఆ పిల్లల్ని కాపాడుకొనేందుకు వెయ్యి పడకలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఎస్‌.సి., ఎస్‌.టి. సబ్‌ప్లాన్‌........

ఎస్సీ ఎస్టీల నిధుల్ని పూర్తిగా వారికే వినియోగించేలా చట్టం చేయడంలో దేశంలో మన రాష్ట్రం మొదటిదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ చారిత్రక నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం అధనంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తామని తెలిపారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా మంత్రులు పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావు, కోండ్రు మురళి, ప్రభుత్వ విప్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు ఉన్నారు.

No comments:

Post a Comment